స్నానానికి సబ్బు బదులు ఇది వాడితే మస్తు బెనిఫిట్స్!
TeluguStop.com
స్నానం చేయడానికి సబ్బు వాడటం చాలా కామన్.ఈ క్రమంలోనే ప్రస్తుతం మనకు మార్కెట్‌లోకి ఎన్నో రకాల సోపులు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో స్కిన్ కేర్ కోసం ఒక్కొక్కరు ఒక్కో సోప్ ను సెలెక్ట్ చేసుకుంటారు.
కానీ, సోప్స్ వాడకం వల్ల.వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై దద్దుర్లు మరియు దురదలకు కారణమవుతాయి.
మరియు దీర్ఘకాలంలో చర్మ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది.అయితే స్కిన్ కేర్ విషయంలో సోపుల కంటే శెనగపిండే ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు.
"""/" /
సోప్స్‌కు ప్రత్యామ్నాయంగా శెనగపిండి వాడటమే మంచిదంటున్నారు.పైగా శెనగపిండి వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు.
మరియు ఎన్నో బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.శెనగపిండిలో కొద్దిగా పాల మిగడ లేదా కొబ్బరి నూనె వేసి చర్మానికి పట్టించి.
ఆరిన తర్వాత రుద్దుకుంటూ స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయి ఉన్న మృత కణాలు పోయి.
ప్రకాశవంతంగా మారుతుంది.అలాగే ప్రతి రోజు శెనగ పిండితో స్నానం చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.
దాంతో చర్మంపై వచ్చే ముడతలు తగ్గుముఖం పడతాయి.ఇక చాలా సన్ టాన్ సమస్యతో బాధ పడుతుంటారు.
అయితే రెగ్యులర్‌గా సబ్బుతో కాకుండా శెనగపిండితో బాత్ చేస్తే.సన్ టాన్ సమస్యే ఉండదని బ్యూటీషియన్లు అంటున్నారు.
శెనగ పిండితో ప్రతి రోజు బాత్ చేయడం వల్ల.న్యాచురల్‌గా మొటిమలు, నల్ల మచ్చలు కూడా పోతాయి.
చర్మం కాంతివంతగా, తెల్లగా కూడా మారుతుంది.ఇక శెనగ పిండితో స్నానం చేస్తే.
అవాంచిత రోమాల సమస్య తగ్గుముఖం పడుతుంది.అందుకే కెమికల్స్ ఉన్న సోపుల కంటే శెనగపిండి స్నానానికి మంచిది.
కాబట్టి, ఇకపై సోపులకు బదులుగా శెనగ పిండిని వాడటానికి ప్రయత్నించండి.
జగన్ ఈ విషయంలో తప్పుచేశారా ?