చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మార్చే అవకాడో ఆయిల్..ఎలా వాడాలంటే?

చ‌ర్మం య‌వ్వ‌నంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, నేటి ఆధునిక కాలంలో ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే కాస్మోటిక్స్ వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డి.

చ‌ర్మం య‌వ్వ‌న‌త్వం కోల్పోతుంది.ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క‌.

తీవ్రంగా కృంగిపోతుంటారు.అయితే చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మార్చ‌డంలో అవ‌కాడో ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి అవ‌కాడో ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ అవ‌కాడో ఆయిల్‌, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా మసాజ్ చేసుకోవాలి.

అర గంట లేదా గంట పాటు ఆర‌నిచ్చి.ఆ త‌ర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే ముడ‌త‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా, అందంగా మారుతుంది.

అలాగే ఒక బౌల్‌లో అవ‌కాడో ఆయిల్‌, అలోవెర జెల్‌, రోజ్ వాట‌ర్ వేసి క‌లుపు కోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా క‌నిపిస్తుంది.ఇక బాగా పండిన బొప్పాయి పండు గుజ్జులో కొద్దిగా అవ‌కాడో ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు ప‌ట్టించి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి.

చ‌ర్మం బిగుతుగా, మృదువుగా మారుతుంది.

బుల్లితెరపై ప్రభాస్ పరువు పాయే.. సలార్ మూవీ టీఆర్పీ రేటింగ్ ఇంత ఘోరమా?