పురుషులు క‌ల‌బంద‌ను ఇలా వాడితే..ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

సాధార‌ణంగా స్త్రీల‌ మాదిరిగానే పురుషులూ ఎన్నో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.ముఖ్యంగా మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌ర‌చూ ముఖం జిడ్డు కార‌డం, చ‌ర్మం పొడిబార‌డం, స్కిన్ ర‌ఫ్‌గా మారిపోవ‌డం , చ‌ర్మం క‌మిలిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో నానా ఇబ్బందులు ప‌డుతుంటారు.

ఈ చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలియ‌క తెగ కుమిలిపోతుంటారు.

అయితే ఖ‌రీదైన క్రీములు, లోష‌న్ల కంటే ఇంట్లో పెరిగే క‌ల‌బంద ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

అవును, ఇప్పుడు చెప్పే విధంగా మ‌గ‌వారు క‌ల‌బంద‌ను వాడిన‌ట్టు అయితే.వారు కూడా చ‌ర్మాన్ని కాంతివంతంగా మెరిపించుకోవ‌చ్చు.

స‌హ‌జంగా స్త్రీల కంటే మ‌గ‌వారు బ‌య‌ట ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిరుగుతుంటారు.దాంతో వారి చ‌ర్మం క‌మిలిపోవ‌డం, ట్యాన్ అవ్వ‌డం జ‌రుగుతుంటుంది.

అలాంటప్పుడు ఒక బౌల్‌లో క‌ల‌బంద జెల్‌, చిటికెడు క‌స్తూరి ప‌సుపు మ‌రియు నిమ్మ ర‌సం వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి ప‌దిహేను నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే చ‌ర్మం మ‌ళ్లీ తాజాగా, కాంతివంతంగా మారుతుంది. """/" /</di అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల క‌ల‌బంద జెల్‌, బొప్పాయి పేస్ట్ వేసుకుని బాగా క‌లిపి.

ముఖానికి అప్లై చేసుకోవాలి.ప‌ది, ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా పోతాయి.మురియు చ‌ర్మ ఛాయ కూడా పెరుగుతుంది.

ఇక చాలా మంది మ‌గ‌వారు త‌మ స్కిన్ ర‌ఫ్‌గా ఉంద‌ని బాధ ప‌డుతుంటారు.

అలాంటి వారు కలబందను చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీటిలో ఉడికించండి.

చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి అందులో పెరుగు మ‌రియు తేనె క‌లిపి ముఖానికి పూయండి.

ఆరిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోండి.ఇలా చేయ‌డంతో ముఖం మృదువుగా, సున్నితంగా మారుతుంది.

మ‌రియు ముడ‌త‌లు కూడా రాకుండా ఉంటాయి.

ఇదేందయ్యా ఇదే.. స్కూల్ యూనిఫామ్ తొడుక్కున్న కుక్క.. వీడియో వైరల్..