జీరో విద్యుత్ బిల్లులు రాక ఆందోళనలో లబ్దిదారులు

నల్లగొండ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 200యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అర్హులైన కొందరు వినియోగదారులకు అందకుండా పోయింది.

మార్చి నెలలో తీసిన బిల్లులో 200 యూనిట్లలోపు వాడకం జరిగినా జీరో బిల్లు రాకుండా యధావిధిగా బిల్లు రావడంతో,అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జీరో కరెంట్ బిల్లుకి బదులు వందల రూపాయల బిల్లులు చేతికందడంతో అయోమయానికి గురవుతూ అర్హత ఉన్నా గృహజ్యోతి పథకానికి దూరమయ్యామని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత అధికారులను అడిగితే ఆన్లైన్ ఎంట్రీలో పొరపాటుతో ఇలా జరిగిందని,ఆధార్,రేషన్ కార్డు,కరెంట్ బిల్లు,ప్రజా పాలన రశీదు తీసుకొని ఎంపిడివో ఆఫిస్ కి వెళ్ళి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

దీంతో ప్రజలు జిరాక్స్ పేపర్లతో ప్రజా పాలన కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.కానీ,అక్కడ కూడా ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో తామేమీ చేయలేమంటూ ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

17 యూనిట్లు వాడుకున్నా రూ.112 బిల్లు వచ్చిందని సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన కొత్తపల్లి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉందని,ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నానని, గత నెలలో 17 యూనిట్లు మాత్రమే వాడుకున్ననని, జీరో బిల్లు రాకుండా రూ.

112 బిల్లు వచ్చిందేమిటని అధికారులను అడిగితే మళ్లీ అప్లికేషన్ చేసుకోమంటున్నారు.ఎంపీడీఓ ఆఫిస్ కి వెళితే ఎడిట్ ఆప్షన్ లేదని అంటున్నారు.

ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు.

ఐదేళ్లలో జక్కన్న ఒక సినిమా తీస్తే ప్రభాస్ 5 సినిమాలు.. రాజమౌళి మారక తప్పదా?