తెలంగాణలో బెల్ట్ షాపులు క్లోజ్…?
TeluguStop.com
నల్లగొండ జిల్లా: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది.
బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.గ్రామాల్లోని బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిస అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్రంలోని బెల్ట్ షాపుల క్లోజ్ కు ప్రణాళికలు చేస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే రాష్ట్రంలో బెల్ట్ షాపులను క్లోజ్ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2 వేల 620 వైన్స్ ఉన్నాయి.
వైన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి.తెలంగాణలో మొత్తం 12 వేల 769 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులున్నాయి.ఈ లెక్కన యావరేజ్ గా చూస్తే రాష్ట్రంలో లక్ష 10 వేలకు పైగా బెల్ట్ షాపులన్నాయి.
24 గంటల పాటు బెల్ట్ షాపుల్లో లిక్కర్ ను అమ్ముతుండటం, రాష్ట్రంలోని యువత ఎక్కువగా మద్యానికి బానిసగా మారటం, అనాధికారికంగా బెల్ట్ షాపు యాజమానులు దందా చేస్తున్నారన్న ఆరోపణలతో బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుంటే వారిపై కేసులు పెట్టేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది.
లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది.
ఇటీవల ఎన్నికల కోడ్ వల్ల బెల్టుషాపులు బంద్ చేశారు.కొత్త లైసెన్స్ వ్యాపారం డిసెంబర్ 1 నుంచి మొదలైంది.
కాబట్టి మళ్లీ కొత్తగా బెల్టుషాపులతో అగ్రిమెంట్లు జరుగుతున్నాయి.హోల్సేల్,రిటైల్పేరుతో రెండు రకాల లిక్కర్దందా నడుస్తోంది.
గ్రామాల్లో బెల్టుషాపులు తీసేస్తే ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం తగ్గొచ్చని ఎక్సైజ్శాఖ అంచానా వేస్తుంది.
ఆ మూవీకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ కమెడియన్.. ఏమైందంటే?