ఈ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండొచ్చు!

బెల్లీ ఫ్యాట్‌.ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని క‌ల‌వ‌ర పెడుతున్న స‌మ‌స్య ఇది.

శ‌రీరం మొత్తం నాజూగ్గా ఉన్నా.పొట్ట వ‌ద్ద మాత్రం కొవ్వు పేరుకుపోయి లావుగా మారుతుంటుంది.

దీనినే బెల్లీ ఫ్యాట్ అంటారు.ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు, శ‌రీరానికి శ్ర‌మ లేక‌పోవ‌డం, గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌టం, ఒత్తిడి, నిద్ర‌లేమి వంటి కార‌ణాల వ‌ల్ల బెల్లీ ఫ్యాట్ ఏర్పడుతుంటుంది.

దీనిని నిర్ల‌క్ష్యం చేస్తే శ‌రీర ఆకృతి అస‌హ్యంగా క‌నిపించ‌డంతో పాటు మధుమేహం, గుండె పోటు, బీపీ వంటి ర‌క‌ర‌కాల వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు క్ర‌మంగా పెరిగిపోతాయి.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ను రాకుండా అడ్డుకోవ‌చ్చు.

మ‌రియు ఉన్న ఫ్యాట్‌ను క‌రిగించుకొని పొట్ట‌ను నాజూగ్గా మార్చుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండాలంటే ఏయే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఓ చూపు చూసేయండి.

బెల్లీ ఫ్యాట్ త‌గ్గాల‌న్నా, రాకుండా ఉండాల‌న్నా శ‌రీరానికి ప్రోటీన్‌ను అందించ‌డం ఎంతో ముఖ్యం.

అందుకే కార్బోహైడ్రేట్లను ప్రోటీన్‌తో భ‌ర్తీ చేయాలి.అంటే కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాల బ‌దులుగా ప్రోటీన్ పుష్క‌లంగా ఉండే ఫుడ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

"""/" / అలాగే బెల్లీ ఫ్యాట్‌కు దూరంగా ఉండాలంటే పోష‌కాహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో.

వేళ‌కు తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం.ఎప్పుడూ ఫుడ్‌ను టైమ్ టు టైమ్ తీసుకుంటే బాడీ హెల్తీగా, ఫిట్‌గా ఉంటుంది.

బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించాలంటే శ‌రీరానికి శ్ర‌మ ఎంతో అవ‌స‌రం.అందుకోసం ప్ర‌తి రోజు ముప్పై నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామాలు చేయాలి.

బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్ట‌డంలో పండ్లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అందుకే రోజుకు క‌నీసం రెండు ర‌కాల పండ్ల‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

"""/" / బెల్లీ ఫ్యాట్‌ను త‌గ్గించుకోవాల‌నుకుంటే నిద్ర ఎంతో అవ‌స‌రం.కంటి నిండా నిద్ర ఉంటేనే ఒత్తిడికి దూరంగా ఉంటారు.

ఆక‌లి అదుపులో ఉంటుంది.చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా బెల్లీ ఫ్యాట్ మాయం అవుతుంది.ఇక బెల్లీ ఫ్యాట్‌తో బాధ‌ప‌డేవారు, బెల్లీ ఫ్యాట్ బారిన ప‌డ‌కుండా ఉండాల‌నుకునేవారు డైట్‌లో ఎప్పుడూ లోకేల‌రీ ఫుడ్ నే చేర్చుకోవాలి.

వాట‌ర్ ఎక్కువ‌గా సేవించాలి.మ‌రియు ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి అల‌వాట్లను వ‌దులుకోవాలి.

సినిమా వర్క్స్ పూర్తయినా కూడా కల్కి ఎందుకు విడుదలకు నోచుకోవడం లేదు ?