ట్రైన్‌లో బెల్లీ డ్యాన్స్‌తో సెగలు పుట్టించిన యువతి.. వీడియో వైరల్..

ముంబైలోని లోకల్ ట్రైన్‌లో( Mumbai Local Train ) ఈ మధ్యకాలంలో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి.

తాజాగా ఓ యువతి తన నడుమందాలు కనిపించేలా బెల్లీ డ్యాన్స్ చేసింది.అన్నీ ఊపేస్తూ ఆమె ప్రయాణికులకు షాక్ ఇచ్చింది.

రైలు కదులుతున్న సమయంలో ఓ పాటకు ఈమె డ్యాన్స్ చేసింది.మాంచి బీట్ సాంగ్ కు ఆమె తన నడుమును ఊపుతూ సెగలు పుట్టించింది.

ఈ డ్యాన్స్ ను ప్రయాణికులు వీడియో రికార్డ్ చేసి X (ట్విటర్ కొత్త పేరు)లో షేర్ చేయగా అది వైరల్ అయింది.

కొంతమంది అమ్మాయి నృత్యాన్ని మెచ్చుకున్నారు.ఆమె స్వేచ్చగా, క్రియేటివ్ గా చేసి ఆకట్టుకుందని రైలులో డ్యాన్స్ చేయడంలో తప్పేమీ లేదన్నారు.

బెల్లీ డ్యాన్స్( Belly Dance ) అనేది కళ, సంస్కృతి యొక్క ఒక రూపమని, అది బహిరంగ కార్యక్రమాలు, సినిమాలలో చేస్తున్నారని వారు సూచించారు.

అమ్మాయికి ఎక్కడ కావాలంటే అక్కడ డ్యాన్స్ చేసే హక్కు ఉందని, ఆమెను ఎవరూ జడ్జ్ చేయవద్దని, అడ్డుకోవద్దని వాదించారు.

"""/" / అయితే కొంత మంది మాత్రం అమ్మాయి డ్యాన్స్‌ను అసభ్యకరంగా, అనుచితంగా ఉందని విమర్శించారు.

ఆమె పబ్లిక్ స్పేస్‌తో పాటు ఇతర ప్రయాణికులను అగౌరవపరుస్తోందని, ఆమె సమాజానికి చెడ్డ ఉదాహరణ అని వారు భగ్గుమన్నారు.

బెల్లీ డ్యాన్స్ భారతీయ సంస్కృతికి, మతానికి సరిపడదని, అది అసభ్యకరం, అభ్యంతరకరమని కూడా చెప్పారు.

రైల్వే అధికారులు యువతిపై చర్యలు తీసుకోవాలని, రైళ్లలో( Trains ) ఇలాంటివి జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

రైళ్లు డ్యాన్స్ కోసం కాదని, ప్రయాణానికి ఉద్దేశించినవని చెప్పారు. """/" / సెంట్రల్ రైల్వేలోని సబర్బన్ సెక్షన్‌లోని CSMT, శాండ్‌హర్స్ట్ రోడ్ స్టేషన్‌ల మధ్య నడిచే రైలులో ఈ వీడియో చిత్రీకరించబడింది.

అయితే, వీడియో కచ్చితమైన తేదీ, ప్రదేశం తెలియ రాలేదు.ఎక్స్‌లో వీడియో వైరల్( Viral Video ) కావడంతో రైల్వే అధికారులు గమనించి ప్రజలకు ఒక ప్రకటన విడుదల చేశారు.

రైలు ప్రయాణంలో ఇటువంటి చర్యలు, విన్యాసాలు చేయవద్దని ప్రయాణికులకు తెలియజేశారు.రైళ్లు ప్రతి ఒక్కరికీ ఉమ్మడి రవాణా సాధనమని, వాటిని గౌరవంగా, బాధ్యతగా ఉపయోగించుకోవాలని చెప్పారు.

అలాగే ప్రయాణికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కథ ఇదేనా.. డైరెక్టర్ బుచ్చిబాబు ప్లానింగ్ అద్భుతం!