బెల్లంకొండ, మనోజ్, నారా రోహిత్ కాంబోలో మల్టీస్టారర్.. ముగ్గురు హీరోలకు సక్సెస్ దక్కుతుందా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది.మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్( Bellamkonda Srinivas ) విజయ్ కనకమేడల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఇందులో మనోజ్,( Manchu Manoj ) నారా రోహిత్( Nara Rohith ) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు.మిరాయ్ సినిమాలో విలన్ గా నటిస్తున్న మనోజ్ మరికొన్ని సినిమాల్లో సైతం విలన్ గా నటిస్తున్నారు.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో మనోజ్ రోల్ ఏంటనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.
విజయ్ కనకమేడల( Vijay Kanakamedala ) అద్భుతమైన కథాంశాన్ని సిద్ధం చేశారని సమాచారం అందుతోంది.
బెల్లంకొండ, మనోజ్, నారా రోహిత్ కాంబోలో మల్టీస్టారర్ తెరకెక్కితే ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.
"""/" /
ఈ సినిమా ఎప్పటినుంచి పట్టాలెక్కుతుందనే ప్రశ్నకు సమాధానాలు దొరకాల్సి ఉంది.
ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కొంతమేర ఆలస్యం అవుతోందని సమాచారం అందుతోంది.
త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించిన మరికొన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. """/" /
త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను దర్శకనిర్మాతలు వెల్లడించనున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమా నిరాశ పరిచిన నేపథ్యంలో సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని భోగట్టా.మనోజ్ సైతం వరుస విజయాలు సాధించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
వాట్ ది ఫిష్ సినిమాలో మనోజ్ హీరోగా నటిస్తుండటం గమనార్హం.
మోహన్ లాల్, మమ్ముట్టి ల మారిపోతూ మన సీనియర్ హీరోలు…