బాలయ్య బాటలో నడుస్తున్న బెల్లంకొండ.. అలాంటి రోల్ తో హిట్ దక్కుతుందా?
TeluguStop.com
బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Bellamkonda Sai Srinivas ) ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ( Bellamkonda Suresh )వారసుడిగా అల్లుడు శ్రీను సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం ఇప్పటివరకు సరైన స్థాయిలో ఒక హిట్ కూడా అందుకోలేకపోతున్నారు.
ఇప్పటివరకు ఈయన నటించిన సినిమాలన్నీ కూడా ఎంతో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోవడంతో ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చత్రపతి రీమేక్ సినిమా( Chatrapati Remake Movie ) ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెడుతూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.
ఇందులో భాగంగా టైసన్ నాయుడు ( Tyson Naidu )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర ( Sagar K Chandra )దర్శకత్వం వహిస్తున్నారు.
"""/" /
ఈ సినిమాతో పాటు డైరెక్టర్ కౌశిక్ పెగళ్ళపాటి ( Director Kaushik Pegalpati )దర్శకత్వంలో BSS 11 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇది ఒక హారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.అంతేకాకుండా మరో కొత్త ప్రాజెక్టుకి కూడా ఈయన కమిట్ అయ్యారని తెలుస్తోంది.
సాయి శ్రీనివాస్ తన 12వ సినిమాతో లుధీర్ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో సాయి శ్రీనివాస అఘోర పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. """/" /
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలు ఇలా అఘోరా పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాలో అఘోర పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే .
త్వరలోనే ఈ సినిమాకు రాబోతున్న చిత్రంలో కూడా ఈయన అదే పాత్రలో కనిపించబోతున్నారు.
అలాగే యంగ్ హీరో విశ్వక్ సేన్ సైతం గామి సినిమాలో అఘోరాగా కనిపించి సందడి చేశారు.
ప్రస్తుతం వారి బాటలోనే సాయి శ్రీనివాస్ కూడా ఇలాంటి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఇదేందయ్యా ఇది.. కూతురి తలపై సీసీటీవీ అమర్చిన తండ్రి.. ఎందుకంటే.?