పూరీ జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ రిమేక్.. రెసులో బెల్లంకొండ సాయి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్.

ఇడియట్, బిజినెస్ మాన్, పోకిరి, నేనింతే వంటి మాస్ సినిమాలను తెరకెక్కించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

చాలా వరకు స్టార్ హీరోల సినిమాలనే తెరకెక్కించాడు.కొన్ని కొన్ని సార్లు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు పూరీ.

అయినా కూడా తన సహనాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి మరి సినిమాలను రూపొందిస్తున్నాడు.

ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాకు దర్శకత్వం వహించక ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ఇంకా విడుదల కానే లేదు.అప్పుడే పూరి మరో సినిమా గురించి ప్లాన్ చేశాడు.

కానీ అది కొత్త కథ కాదు.ఇది వరకు ఆయన రూపొందించిన సినిమానే హిందీలో రీమేక్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.బిజినెస్ మాన్.

"""/"/ 2012లో పూరి దర్శకత్వంలోనే విడుదలైన సినిమా ఇది.ఇందులో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ నటీనటులుగా నటించారు.

అంతేకాకుండా ప్రకాష్ రాజ్, నాజర్ కూడా ముఖ్యపాత్రలో నటించారు.ఇక ఈ సినిమాను ఆర్.

ఆర్.మూవీ మేకర్స్ పతాకం పై ఆర్.

ఆర్.వెంకట్ నిర్మించాడు.

ఇక ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది.

ఇక మహేష్ బాబుకు కూడా ఈ సినిమా ప్లస్ పాయింట్ గా మారింది.

అయితే ఈ సినిమాను పూరి హిందీలో రీమేక్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పూరి చాలా సినిమాలను ఇతర భాషలలో రీమేక్ చేశాడు.అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.

మామూలుగా రీమేక్ సినిమాలు చాలా తక్కువ సందర్భాలలో సక్సెస్ అవుతుంటాయి. """/"/ కానీ పూరీ దర్శకత్వంలో వచ్చిన రీమేక్ సినిమాలు అన్ని మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇక పూరి ఇప్పుడు బిజినెస్ మాన్ సినిమా గురించి హిందీ రీమేక్ చేయాలి అని ప్లాన్ చేయటంతో.

రేసులోకి బెల్లంకొండ సాయి పేరు వినిపిస్తుంది.ఎందుకంటే చత్రపతి బాలీవుడ్ రీమేక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అవకాశం రాగా.

ఇప్పుడు బిజినెస్ మాన్ సినిమా కోసం కూడా ఆయన ఎదురు చూస్తున్నట్లు కొందరి మీమర్స్ ఓ మీమ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

అంతేకాకుండా అందులో పూరి.సరదాగా బిజినెస్ మాన్ రీమేక్ చెయ్యొచ్చు ఛార్మి అనగా దానికి బెల్లంకొండ సాయి ఫోటోను కాస్త ఆశగా ముఖం పెట్టినట్లు చూపించారు.

ఇక ఆ కరణ్ జోహార్ ను మాత్రం ప్రొడ్యూసర్ గా తీసుకోకండి అంటూ ఒక కామెంట్ కూడావేశారు.

ప్రస్తుతం ఆ మీమ్ బాగా వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల మీద భారీ ఫోకస్ పెడుతున్నాడా..?