మన రాక్షసుడు హిందీకి వెళ్తున్నాడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా తెరకెక్కిన రాక్షసుడు గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్‌గా కూడా ఆకట్టుకుంది.బెల్లంకొండకు ఈ చిత్రంతో మంచి గుర్తింపు దక్కింది.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలకు రాక్షసుడు మూవీ బూస్టింగ్‌ ఇచ్చిందంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఇక తెలుగు సినిమాలు హిందీలో రీమేక్‌ అవ్వడం చాలా కామన్‌గా జరుగుతుంది.ఈ చిత్రాన్ని కూడా హిందీలో రీమేక్‌ చేయాలనే నిర్ణయానికి చిత్ర యూనిట్‌ సభ్యులు వచ్చారట.

రాక్షసుడు చిత్రాన్ని దర్శకుడు రమేష్‌ వర్మ తెరకెక్కించాడు.చాలా ఏళ్లుగా ఈయన దర్శకుడిగా సినిమాలు చేస్తున్నాడు.

అయితే అందులో ఒక్కటి కూడా సక్సెస్‌ అయిన దాఖలు లేవు.దాంతో ఆయన కెరీర్‌ ఖతమేనా అనుకుంటున్న సమయంలో రాక్షసుడు మూవీ వచ్చి మళ్లీ కెరీర్‌పై ఆశలు కల్పించింది.

రాక్షసుడు సక్సెస్‌ అవ్వడంతో రవితేజ హీరోగా ఒక సినిమాను చేసేందుకు ఛాన్స్‌ దక్కించుకున్నాడు.

అతి త్వరలోనే మరో సినిమాను కూడా ఈయన చేసే అవకాశం ఉంది.రవితేజతో సినిమా పూర్తి చేసిన వెంటనే రాక్షసుడు సినిమాను బాలీవుడ్‌లో ఈ దర్శకుడు రీమేక్‌ చేయబోతున్నాడు.

తెలుగులో నిర్మించిన కోనేరు సత్యనారాయణ హిందీలో కూడా నిర్మించబోతున్నాడు.యంగ్‌ స్టార్‌ హీరోతో ఈ రీమేక్‌ను హిందీలో చేసే అవకాశం ఉంది అంటున్నారు.

వీరిని నమ్మి హిందీలో చేసేందుకు స్టార్‌ హీరో ఎవరైనా ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు.

అయితే పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా రమేష్‌ వర్మ ఆ రీమేక్‌ పై చాలా పట్టుదలతో ఉన్నాడు.

దారుణం.. పండుగరోజు ఇంటి ముందర కొడుకు చూస్తుండగానే తండ్రిపై అఘాయిత్యం