ఫొటోటాక్‌ : బెల్లంకొండ ఈ లుక్‌ లో ఇరగదీశావ్‌ వోయ్‌

తెలుగు కమర్షియల్‌ హీరోలకు ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఉంటాడు.

నిజంగా బెల్లంకొండ బాడీలాంగ్వేజ్‌ మరియు పర్సనాలిటీ కాని ప్రేక్షకులను మరియు సినీ వర్గాల వారిని వావ్‌ అనిపించేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.

టాలీవుడ్‌ లో అతి కొద్ది మందికి మాత్రమే ఇలాంటి చార్మింగ్‌ ఉంది.అందులో బెల్లంకొండ ఒకడు.

ఈయన హీరోగా ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్నాడు.ఖచ్చితంగా ఈయన ముందు ముందు మరిన్ని మంచి మాస్‌ కమర్షియల్‌ సినిమాలు చేసి సూపర్‌ హిట్‌ అవుతాడనే నమ్మకం అందరికి వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.ఈ సమయంలోనే ఈ హీరో షేర్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రెట్రో కారు మరియు రెట్రో లుక్‌ లో బెల్లంకొండ ను ఇందులో చూడవచ్చు.

చాలా స్టైలిష్‌ గా ఉన్న కారు వద్ద అంతే స్టైలిష్‌ రెట్రో లుక్‌ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ అదుర్స్‌ అనిపించాడు.

అల్లుడు అదుర్స్‌ కాదు నిజంగా బెల్లంకొండ అదుర్స్‌ అన్నట్లుగా ఈ లుక్‌ లో ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు.

మాస్‌ ఆడియన్స్‌ ను టార్గెట్‌ చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చేస్తున్న సినిమాలు నిజంగా అందరిని ఆకట్టుకుంటున్నాయి.

అన్ని వర్గాల వారు కూడా ఈ యంగ్‌ హీరోను ఇష్టపడుతారు అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం అల్లుడు అదుర్స్‌ను ముగించే పనిలో ఉన్న ఈ యంగ్‌ హీరో త్వరలో మరో పెద్ద దర్శకుడితో కలిసి సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

ఆ సినిమాతో మరింతగా స్టార్‌డంను ఈయన దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది.ఇలాంటి స్టైలిష్‌ లుక్‌ తో ఆకట్టుకునే బెల్లంకొండ బాబు ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

అల్లుడు అదుర్స్‌ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఆర్టిస్టులకు రాజమౌళి కొత్త కండిషన్స్ పెడుతున్నాడా..?