సక్సెస్‌ కోసం మరోసారి అల్లుడిగా మారిన బెల్లంకొండ

సక్సెస్‌ కోసం మరోసారి అల్లుడిగా మారిన బెల్లంకొండ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.కాని ఇప్పటి వరకు కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ మాత్రం ఈయనకు దక్కిందే లేదు.

సక్సెస్‌ కోసం మరోసారి అల్లుడిగా మారిన బెల్లంకొండ

ఎప్పుడు కూడా ఫ్లాప్‌ లేదంటే ఒక యావరేజ్‌ మూవీనే ఈయనకు పడుతుంది.మంచి హిట్‌ కోసం వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న ఈ యువ హీరో ప్రస్తుతం సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

సక్సెస్‌ కోసం మరోసారి అల్లుడిగా మారిన బెల్లంకొండ

"""/"/పెద్దగా అంచనాలు లేకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ నేడు రివీల్‌ చేశారు.

ఫస్ట్‌లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఎందుకంటే అల్లుడు అదుర్స్‌ అంటూ ఈ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేశారు.

టైటిల్‌లో అల్లుడు ఇంకా అదుర్స్‌ రెండు పదాలు కూడా మంచి ఫేమ్‌ ఉన్న పదాలు.

ఆ కారణంగానే అల్లుడు అదుర్స్‌ సినిమాతో బెల్లంకొండ హీరో సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

కందిరీగ వంటి కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు మళ్లీ సక్సెస్‌ కోసం చాలా ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు.

ఇప్పుడు ఈ సినిమాతో మరో కందిరీగలాంటి సక్సెస్‌ను అందుకుంటాడేమో చూడాలి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ డిసిజన్స్ మారిపోయాయా..?

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ డిసిజన్స్ మారిపోయాయా..?