ఆన్ లైన్ లో ఎన్నారై మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి.తాజాగా ఆన్లైన్లో పరిచయమైన ఒక ఎన్నారై మహిళను పంజాబ్ లోని మొగాకు చెందిన యువకుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.

ఆమె నుంచి గత రెండు సంవత్సరాలుగా భారీ మొత్తంలో నగదు, విలువైన కానుకలను తీసుకున్నాడు.

ఆ తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు తయారైపోయాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్నారై యువతీ అమెరికా నుంచి భారత్కు వచ్చి ఆ యువకుడి బండారం బయటపెట్టింది.

పంజాబ్ రాష్ట్రం మొగాకు చెందిన కుల్విందర్ సింగ్ కాలిఫోర్నియాలో స్థిరపడ్డ అమృత్‌సర్‌లోని చౌక్ మెహతాకు కు చెందిన ఎన్నారై మహిళతో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా రెండు సంవత్సరాల క్రితం పరిచయమైంది.

దానితో వాళ్ళిద్దరూ తరచూ సోషల్ మీడియాలో చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో తను మంచి ట్రాక్ డ్రైవర్ అని ఆమెతో చెప్పాడు.

దాంతో ఆమె యూఎస్ లోని ట్రాక్ డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉందని ఇక్కడికి షిఫ్ట్ అయితే తను సాయం చేస్తానని చెప్పింది.

"""/"/ అప్పటినుంచి గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు మాట్లాడడం, చాట్ చేయడం చేశాడు.

ఆ తర్వాత ఒకరోజు అతడు ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టాడు.

దానికి కూడా ఆమె అంగీకరించింది.అప్పటి నుంచి ఆమె అతడికి భారీ మొత్తంలో నగదు, గిఫ్టులు పంపించడం చేసింది.

ఈ క్రమంలో ఇటీవల అతడి గురించి ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. """/"/ మరో యువతీతో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకొని కుల్విందర్ సింగ్ కు కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించింది.

కానీ ఆమె కాల్స్ కు కుల్విందర్ స్పందించలేదు.దీనివల్ల ఆమె స్వదేశానికి వచ్చి కుల్విందర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన అతడు చాలాకాలంగా దాటవేస్తూ వస్తున్నాడని పోలీసులకు వెల్లడించింది.

అతడు కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆర్థికంగా సాయం చేశాను.తీరా ఇప్పుడు మరో యువతి నీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.

ఎన్ఆర్ఐ మహిళా ఫిర్యాదు మేరకు కుల్విందర్ పై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్