సరస్వతీదేవిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
TeluguStop.com
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.ఇవాళ అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మ.
సరస్వతీదేవీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.విశిష్ఠమైన రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.
దీంతో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రద్దీ పెరిగింది.అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి దర్శనానికి క్యూలైన్లలో అనుమతించారు.
అంతరాలయం, ప్రత్యేక దర్శనం టికెట్లు రద్దు చేసి అందరికీ ఉచితంగానే అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు.
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబ సమేతంగా సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూల నక్షత్రం రోజున దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ.ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలనక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.
దేవర నిర్మాతల కంటే ఆయనకే ఎక్కువ లాభాలను అందించిందా.. ఏమైందంటే?