Cashless బిచ్చగాడు: ఇతను అడుక్కునే విధానం చూస్తే ఎవరికైనా మతిపోతుంది!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ బిచ్చగాడు భిక్షాటనలో కొత్త రికార్డు సృష్టించాడు.

నగదు రహిత (cashless) ప్రచారంలో భాగంగా మారి వార్తల్లో నిలిచాడు.ఇంతేకాదు అతను అడుక్కునే విధానాన్ని వినూత్నంగా డిజిటలైజ్ చేశాడు.

డిజిటల్‌గా అడుక్కునేందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా తీసుకున్నాడు.హేమంత్ సూర్యవంశీ ఇక్కడి మున్సిపాలిటీలో ఉద్యోగిగా పనిచేసేవాడు.

ఉద్యోగం కోల్పోవడంతో భిక్షాటనతో జీవనోపాధి పొందాలనే నిర్ణయానికొచ్చాడు.అయితే ఆ సమయంలో అతనికి పెద్ద సమస్య కనిపించింది.

అదే చిల్లర సమస్య.భిక్ష కోసం ఎవరి దగ్గర చేయి చాచినా చిల్లర లేదంటూ తప్పించుకునేవారు.

దీంతో సూర్యవంశీ తన భిక్షాటనను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించుకుని, అందుకోసం క్యూఆర్ కోడ్ తీసుకున్నాడు.

హేమంత్ నగర వీధుల్లో భిక్షాటన కోసం తిరుగుతున్నప్పుడు అతని మెడలో క్యూఆర్ కోడ్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ క్యూఆర్‌ కోడ్‌ని మెడలో వేసుకుని అడుక్కుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చిల్లర లేదని ఎవరైనా చెప్పినప్పుడు.సూర్యవంశీ తన క్యూఆర్ కోడ్ చూపించి డిజిటల్ పేమెంట్ చేయాలని కోరుతున్నాడు.

హేమంత్‌కి టెక్నాలజీ సహాయం తీసుకోవడంతో పెద్ద ప్రయోజనం చేకూరింది.ఎందుకంటే గతంలో అతనికి ఒకటి లేదా రెండు రూపాయలు వచ్చే చోట, ఇప్పుడు అతనికి ఐదు రూపాయలకు మించి నగదు వస్తోంది.

డిజిటల్ టెక్నాలజీ వినియోగం వల్ల తన రాబడి పెరిగిందని సూర్యవంశీ చెబుతున్నాడు.హేమంత్ క్యాష్ లెస్ పేమెంట్ ప్రచారంలో భాగంగా మారాడు.

భిక్షాటన ద్వారా ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నాడు. """/"/ హేమంత్ సూర్యవంశీ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ నుంచీ నగదు ఒక దుకాణదారుని ఖాతాకు చేరుతుందని, తాను సాయంత్రం ఆ దుకాణదారుని వద్దకు వెళ్లి తన వాటా మొత్తాన్ని తీసుకుంటానని చెప్పాడు.

ఈ ఆలోచన అతని మదిలో విచిత్రంగా మెదిలింది.అతను దుకాణాల్లో అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు కౌంటర్‌పై క్యూఆర్ కోడ్‌ కనిపించేది.

దీంతో అతను క్యూఆర్ కోడ్ తీసుకుని భిక్షాటన చేయాలని నిర్ణయించుకున్నాడు.భిక్షాటనను డిజిటలైజ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉందని, గతంతో పోలిస్తే రోజువారీ భిక్షాటన పెరిగిందని హేమంత్ తెలిపారు.

ఈ విధంగా లభించిన మొత్తంతోనే అతను కుటుంబాన్ని నడుపుతున్నాడు.

విజయ్ సినిమాలో స్టార్ క్రికెటర్ ధోని.. అలా జరిగితే రికార్డులు క్రియేట్ కావాల్సిందే!