Janhvi Kapoor: దేవర కంటే ముందే ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించాల్సిన జాన్వీ కపూర్.. కానీ తండ్రి వార్నింగ్ ఇవ్వడంతో..!!
TeluguStop.com
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాతో మొదటిసారి తెలుగు సినీ రంగ ప్రవేశం చేయబోతుంది.
ఇక ఈమె ఎన్నో రోజుల నుండి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని వేచి చూస్తుందట.
"""/" /
ఇక దేవర ( Devara) సినిమాతో ఆమె కోరిక నెరవేరింది అని ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
అలాగే తన తల్లి శ్రీదేవి లాగే తను కూడా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.
మరి దేవర సినిమా జాన్వి కపూర్ కి ఎంత మేర హిట్ అందిస్తుంది అనేది తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచి చూడాలి.
కానీ ఈ సినిమా హిట్ అయితేనే జాన్వీ కపూర్ కి తెలుగులో వరుస అవకాశాలు వెలువెత్తుతాయి.
"""/" / ఇప్పటికే రామ్ చరణ్( Ram Charan ) సరసన కూడా ఓ సినిమాకి ఓకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ దేవర సినిమా కంటే ముందే మరో బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాల్సి ఉందట.
కానీ ఆ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసిందట.ఇక ఆ సినిమా ఏదో కాదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.అక్కినేని అఖిల్ ( Akkineni Akhil) హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కే ముందుగా అవకాశం వచ్చిందట.
కానీ ఈ సినిమాని జాన్వీ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.దానికి ప్రధాన కారణం జాన్వీ తండ్రి బోని కపూర్( Boney Kapoor ) .
నువ్వు స్టార్ హీరో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలి కానీ ఇలా ఇప్పటివరకు ఎలాంటి హిట్ ని తన ఖాతాలో వేసుకొని అఖిల్ తో టాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తే నీకు తెలుగులో అవకాశాలు రావు అని చెప్పారట.
దాంతో ఆ ఛాన్స్ ని జాన్వీ కపూర్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం.ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా చేసింది.
అలా తండ్రి కారణంగానే జాన్వీ కపూర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ( Most Eligible Bachelor ) సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వదులుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయి.
అయ్యబాబోయ్.. మీరు ఎప్పుడైనా ఇలాంటి గుడ్లను చూసారా?