Beetroot Juice : చర్మం అందంగా మెరవడానికి బీట్రూట్ జ్యూస్ ను ఇలా తయారు చేసుకోండి..!

ముఖ్యంగా చెప్పాలంటే బీట్‌రూట్ జ్యూస్( Beetroot Juice ) చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది.

దీనిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.అయితే ఈ బీట్‌రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి.

అంతే ఎలాంటి ఖర్చు శ్రమ లేకుండా బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసుకోవడం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం మీరు కొన్ని బీట్రూట్, ఇంట్లో ఉపయోగించే వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది.

బీట్‌రూట్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బీట్రూట్ 1, నారింజ లేదా యాపిల్ సగం ముక్క, అల్లం చిన్న ముక్క, నిమ్మరసం ఒక టీ స్పూన్, తేనే ఒక టీ స్పూన్, నీరు 1/2 కప్పు ఉంటే సరిపోతుంది.

"""/"/ ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.అలాగే బీట్రూట్ ను శుభ్రంగా కడిగి ఆరెంజ్ లేదా ఆపిల్ ఉపయోగిస్తుంటే, వాటిని కూడా శుభ్రంగా కడగాలి.

బీట్రూట్, నారింజ లేదా ఆపిల్ అల్లం ముక్కలను జూసర్ లో వేసి రసం బయటకు తీయాలి.

రసాన్ని గాజు పాత్రలోకి తీసుకొని అవసరమైతే నీటిని కలుపుకోవాలి.అలాగే నిమ్మరసం తేనే జోడించి బాగా మిక్స్ చేయాలి.

ఈ విధంగా మీరు బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు.దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా( Healthy Skin ) ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే బీట్రూట్ రసం రుచి కొంచెం మట్టి రుచి కలిగి ఉంటుంది.

"""/"/ ఇందులో ఎక్కువ పోషకాళ్ల కోసం బీట్రూట్ ఆకులను కూడా మిక్స్ చేసుకోవచ్చు.

రోజుకొక గ్లాస్ మాత్రమే దీన్ని తాగాలి.ఎందుకంటే ఎక్కువగా తాగడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బీట్రూట్ జ్యూస్ ను తాగిన తర్వాత మూత్రం ఎరుపు రంగులోకి మారవచ్చు.ఇది సాధారణమే అని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధంగా బీట్రూట్ జ్యూస్ తయారు చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?