బీట్‌రూట్‌తో హెయిర్ సీర‌మ్‌.. వారంలో 2 సార్లు వాడితే ఒత్తైన సిల్కీ జుట్టు మీ సొంతం!

బీట్‌రూట్‌.దీని గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే ఈ దుంప‌ల్లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, విటమిన్ కె, విటమిన్ బీ9, విటమిన్ సి, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌తో పాటు శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మెండుగా నిండి ఉంటాయి.

అందుకే బీట్‌రూట్ దుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేస్తాయి.

అలాగే జుట్టు సంర‌క్ష‌ణ‌కు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా బీట్‌రూట్‌తో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా హెయిర్ సీర‌మ్‌ను త‌యారు చేసుకుని యూస్ చేస్తే ఒత్తైన సిల్కీ జుట్టు మీసొంతం అవుతుంది.

మ‌రి ఇంకెందుకు అల‌స్యం బీట్‌రూట్‌తో హెయిర్ సీర‌మ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బీట్‌రూట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.ఇలా క‌డిగిన బీట్‌రూట్‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బీట్‌రూట్ ముక్క‌లు, రెండు మందారం పువ్వుల రేక‌లు, ఒక క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుని.

జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, నాలుగు చుక్క‌లు పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సీర‌మ్ సిద్ధం అవుతుంది.

"""/" / ఈ సీర‌మ్‌ను నైట్ నిద్రించే ముందు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ ధ‌రించాలి.

ఉద‌యాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి త‌ల‌స్నానం చేయాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు గ‌నుక చేస్తే జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

పొడిబారిన జుట్టు సిల్కీ, షైనీగా మారుతుంది.మ‌రియు చుండ్రు స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

చైనా: ఇంటర్నెట్ కేఫ్‌లో చనిపోయిన వ్యక్తి.. 30 గంటలైనా గుర్తించని సిబ్బంది..