నోటి పూత‌తో స‌త‌మ‌తం అవుతున్నారా? అయితే బీట్‌రూట్‌తో ఇలా చేయండి!

నోటి పూత.మనలో చాలా మందిని సర్వసాధారణంగా వేధించే సమస్యలో ఇది ఒకటి.

డీహైడ్రేషన్, శరీరంలో వేడి ఎక్కువ అవడం, అధిక ఒత్తిడి, నోటి శుభ్రత లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, పలు రకాల మందుల వాడకం, పోషకాల కొరత, బ్యాక్టీరియా తదితర కారణాల వల్ల నోటి పూత సమస్య తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

ఈ నోటి పూత వల్ల ఏం తినాలన్నా, తాగాలన్నా జంకుతుంటారు.ఈ క్రమంలోనే నోటిపూతను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే కనుక చాలా సులభంగా మరియు వేగంగా నోటి పూతను నివారించుకోవచ్చు.

మరి ఆ డ్రింక్ ఏంటో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా ఒక బీట్ రూట్ ను తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, ఒక కప్పు కొబ్బరి తురుము, నాలుగు నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు, వన్ టేబుల్ స్పూన్‌ బెల్లం తురుము, ఒకటిన్నర గ్లాసుల వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్‌ సహాయం తో జ్యూస్‌ను స‌ప‌రేట్‌ చేసుకోవాలి.

ఈ జ్యూస్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే గనుక నోటిపూత ఎంత తీవ్రంగా ఉన్నా చాలా వేగంగా తగ్గు ముఖం పడుతుంది.

పైగా ఈ జ్యూస్‌ను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

ఎముకలు బలంగా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది.

చర్మం నిగారింపుగా కూడా మెరుస్తుంది.

తండ్రి హమాలీ.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొడుకులు, కూతురు.. వీళ్ల సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!