టీమ్ వర్క్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తేనెటీగలు.. ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేశాయి!
TeluguStop.com
ఐకమత్యానికి సంబంధించిన నీతి కథలు చిన్నతనంలో అందరం విని ఉంటాం.అయితే ప్రస్తుతం మనుషుల మధ్య ఐకమత్యం అనేది తగ్గిపోయింది.
ఎవరికి వారు స్వార్ధంతో వ్యవహరిస్తూ, ఇతరులను పట్టించుకోవడం లేదు.కుటుంబ సభ్యుల మధ్యే సఖ్యత కనిపించడం లేదు.
అంతా సంపాదన మత్తులో పడి ఆస్తులు వెనకేసుకోవడానికి చూస్తుంటారు.ఇక చాలా మంది తాము ఒక్కరిమే ఏదైనా చేసేయగలమని భావిస్తుంటారు.
అయితే ఒక్కరితో కాని పనులు చాలా ఉంటాయి.కొందరు కలిసి బృందంగా చేస్తే చాలా పనులు సాధ్యమవుతాయి.
ఒక్కరితో అసాధ్యం అనుకున్న పనులు కొందరు కలిస్తే సుసాధ్యం అవుతాయి. """/" /
అయితే ఏదైనా పని విజయవంతంగా కావాలంటే కావాల్సింది టీమ్ వర్క్( Team Work ) .
రెండు తేనెటీగలు దీనిని అమలు చేశాయి.తమ సైజు కంటే ఎంతో పెద్దదైన బాటిల్‌ను అవి పడగొట్టాయి.
ఓపెన్ చేసి డ్రింక్‌ను తాగాయి.ఇలా అసాధ్యం అనుకున్న పనిని అవి సుసాధ్యం చేశాయి.
దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra )సామాజిక మాధ్యమాలలో ఎంతో చురుగ్గా ఉంటారు.
నిత్యం ప్రజలను మోటివేట్ చేసే ఎన్నో వీడియోలను ఆయన పోస్ట్ చేస్తుంటారు.ఇదే కోవలో ఆయన తేనెటీగల వీడియోను తాజాగా షేర్ చేశారు.
ఓ చోట ఫాంటా బాటిల్ ఉంటుంది. """/" / తేనెటీగల( Bees ) స్థాయికి ఆ బాటిల్ చాలా పెద్దది.
అయితే రెండు తేనెటీగలు మాత్రం టీమ్ వర్క్ చేశాయి.ఫాంటా డ్రింక్ తీపిని గ్రహించి, దానిని తాగాలని భావించాయి.
రెండూ కలిసి బాటిల్ మూత తిప్పాయి.అనంతరం ఆ బాటిల్‌ను కింద పడేశాయి.
తర్వాత పడేసిన బాటిల్ నుంచి పడిన డ్రింక్‌ను చక్కగా తాగాయి.దీంతో అసాధ్యం అనుకున్న పనులు టీమ్ వర్క్ చేయడం ద్వారా సుసాధ్యం అవుతాయన్న సందేశాన్ని ప్రజలకు ఆనంద్ మహీంద్రా ఈ వీడియో ద్వారా ఇచ్చారు.
ఈ వీడియో పాతదే అయినా, దానిలో ఉన్న చక్కటి సందేశం దృష్ట్యా ప్రజలను మరోసారి ఆకట్టుకుంటోంది.
దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు.ఆనంద్ మహీంద్రాతో ఏకీభవిస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.
టీమ్ వర్క్‌తో ఏదైనా సాధ్యం అనే సందేశాన్ని తేనెటీగలు ఈ వీడియో ద్వారా తెలిపాయని పేర్కొంటున్నారు.