వామ్మో.. అతడి గడ్డంపై తేనెటీగలు ఏకంగా పుట్ట పెట్టేశాయి..
TeluguStop.com

ఇప్పటి వరకు మీరు బిల్డింగ్ లేదా చెట్టు మీద తేనెటీగలను( Honey Bees ) చూసి ఉంటారు.


అయితే ఒక వ్యక్తి ముఖం మీద తేనెటీగలు ఉండడం చూశారా? ఈ తేనెటీగలు కుడితే చాలా నొప్పి వస్తుంది.


అందుకే కొందరు తుంటరితనంతో తేనెతుట్టపై రాయి వేస్తే ఆ తేనెటీగల గుంపు మనుషులపై దాడి చేస్తుంది.
దీని నుంచి తప్పించుకునేందుకు చాలా మంది తమ వద్ద ఉన్న వస్త్రాలతో దాచుకుంటారు.
లేకపోతే పరుగు పరుగున వెళ్లి నీటిలో దూకుతారు.ఎందుకంటే భరించ లేని నొప్పి( Pain ) తేనెటీగలు మనల్ని కుడితే వస్తుంది.
ఇలాంటి తేనెటీగలతో సహవాసం చేసే వారు కూడా ఉంటారు.అయితే ఓ వ్యక్తి ఏకంగా తేనెటీగలన్నింటినీ తన గడ్డంపై ఉంచుకున్నాడు.
"""/" /
దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.ఇంకేముందు.
ఇది వెంటనే వైరల్( Viral ) అయిపోయింది.అతడి ముఖం చూసి, తేనెటీగలు భారీ స్థాయిలో ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో( Social Media ) ఫేమస్ అయ్యేందుకు కొందరు వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటారు.
అయితే కొందరు ఆ తపనతోనే కాకుండా తమ అభిరుచికి అనుగుణంగా జీవిస్తూ ఆ వీడియోలను కూడా పెడుతుంటారు.
వాటికి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.ఇదే కోవలో ఓ వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
"""/" /
అందులో అతడి గడ్డం( Beard ) నిండా వందల సంఖ్యలో తేనెటీగలు ఉన్నాయి.
ముఖం నిండా కప్పేశాయి.ఆశ్చర్యకరంగా అతడికి అవి ఎటువంటి హాని తలపెట్టలేదు.
వైరల్‌గా మారిన ఈ వీడియోలో, తేనెటీగల సమూహం వ్యక్తి ముఖంపై ఎలా తమ గూడును పెట్టేశాయో చూడొచ్చు.
తేనెటీగలు చాలా దట్టంగా ఉన్నాయి.ఒక తేనెటీగ కూడా కాటు చేస్తే, అప్పుడు శరీరంలో వాపు మొదలవుతుంది.
అటువంటి పరిస్థితిలో, వ్యక్తి ముఖంపై లెక్కలేనన్ని తేనెటీగలు అంటుకోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
జూన్ 16న షేర్ చేసిన ఈ వీడియోను కొన్ని లక్షల మంది చూసారు, అయితే ఈ వీడియోను ఆరు వేల మందికి పైగా లైక్ చేసారు.
ఈ వీడియోను చూసిన వారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ధనుష్ తెలుగు హీరోగా మారిపోతున్నాడా..?