బీర్‌తో ఇలా చేస్తే.. అందమైన, మెరిసే జుట్టు మీ సొంతం!!

జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, అందుకు భిన్నంగా శిరోజాలు ఉంటాయి.

ముఖ్యంగా నేటి కాలంలో జుట్టు రాలే సమస్య చాలామందిని వేధిస్తోంది.జుట్టు తీవ్రంగా రాలిపోతే వాళ్ల ఆత్మ స్తైర్థ్యం మీదా ప్రభావం చూపుతుంది.

త‌ద్వారా అనుకున్న రంగంలో రాణించ‌లేక‌పోతున్నారు.ఇక కొంద‌రికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలుతూనే ఉంటుంది.

అలాంటి వారికి జుట్టు సంరక్షణకు బెస్ట్ ఆప్ష‌న్ బీర్‌.అవును! కేశాలను రక్షించుకోవడానికి ఉపయోగించే వాటిలో బీర్ కూడా ఒకటి.

ఈ న్యాచురల్ పర్ఫెక్ట్ రెమెడీ.దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల కొంతకాలంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టి.

శిరోజాల‌ను అందంగా, మెరిసేలా చేస్తుంది.మ‌రి బీర్‌ను జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మీ జుట్టుకి కావాల్సినంత బీర్‌ని ఓ బౌల్‌లోకి తీసుకుని దానిని జుట్టు మొదళ్లకి పట్టించండి.

ఆరిన తర్వాత తలస్నానం చేయండి.ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వల్ల బీర్‌లో ఉండే మినిరల్స్ , విటమిన్స్ , పోషకాలు.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అలాగే జుట్టు రాలే స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది.

ఒక కప్పు బీర్ ను ప‌ది నిముషాల వేడి చేసి.చల్లబడే వరకూ ఉండాలి.

ఇప్పుడు ఒక కప్పు బీర్ కు షాంపు కలపి.ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి.

అనంత‌రం తలస్నానం చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల.

పొల్యూషన్, ఇతర కారణాల వల్ల పాడైన జుట్టుకి బీర్ పునరుజ్జీవనం ఇస్తుంది.త‌ద్వారా జుట్టు అందంగా మెరుస్తుంది.

అర గ్లాస్ బీర్‌లో కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ క‌లిపాలి.ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు బాగా ప‌ట్టించి.

ఆరిన తర్వాత తలస్నానం చేయండి.ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వల్ల జుట్టు వేగంగా, దృఢంగా పెరగడానికి స‌హాయ‌ప‌డుతుంది.

శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?