బీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే ..?
TeluguStop.com
మనలో చాలా మంది బీరు తాగడం గురించి భిన్నాభిప్రాయాలను కలిగి ఉంటారు.కొందరు బీరు తాగే వ్యక్తులపై ఏకంగా తాగుబోతులనే ముద్ర వేస్తూ ఉంటారు.
అయితే బీరు తాగడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
ఎక్కువ మోతాదులో బీరు తీసుకోవడం వల్ల శరీరానికి నష్టమే అయినప్పటికీ తగిన మోతాదులో బీరును తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
చాలామంది బీర్ తాగితే పొట్ట వస్తుందని భ్రమ పడుతూ ఉంటారు.అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో బీర్ తాగితే పొట్ట రావడం నిజం కాదని తేలింది.
బీరులో ఫౌలీ ఫినాల్ అనే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.తగిన మోతాదులో బీరును తీసుకుంటే ఫౌలీ ఫినాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఫిన్ లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో బీరు తాగేవారిలో కిడ్నీల్లో రాళ్లు సైతం కరుగుతాయని తేలింది.
"""/" /
బీర్ క్యాన్సర్ తో శరీరం పోరాడటంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
బీర్లలో సిలికాన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.ఈ సిలికాన్ ఎముకలను ధృడంగా ఉంచడంలో సహాయపడుతుందని టఫ్ట్స్ యూనివర్సిటి పరిశోధకులు అనేక పరిశోధనలు చేసి వెల్లడించారు.
వెంట్రుకలు ఒత్తుగా, ధృఢంగా పెరగడంలో బీర్ సహాయపడుతుంది.రష్ యూనివర్సిటీ పరిశోధకులు బీర్ తాగేవారిలో జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని తెలిపారు.
బీర్లలో ఉండే ఆల్కహాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎక్కువ చేసి మధుమేహం బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది.
హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు బీర్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని తేల్చారు.అయితే తగిన మోతాదులో బీర్ తీసుకుంటే మాత్రమే బీర్ వల్ల లాభాలు చేకూరుతాయి.
బీర్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవు.
హెచ్ 1 బీ వీసాలకు ఓకే .. కానీ సంస్కరణలు కావాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు