బేబమ్మకి మరో బిగ్ ఆఫర్..!

ఉప్పెన భామ కృతి శెట్టి తెలుగులో వరుస సినిమాలతో సూపర్ ఫాం లో ఉండగా ఈమధ్యనే తమిళ సినిమాల్లో కూడా అలరించింది.

ఇక ఇప్పుడు మళయాళ మూవీ ఆఫర్ కూడా అందుకుంది.కృతి శెట్టి మొదటి మళయాళ ఆఫర్ ఇదే అవడం విశేషం.

మళయాళం లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న స్టార్ టొవినో థామస్ హీరోగా వస్తున్న అజయంతే రందం మోషణం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

3 యుగాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది.సినిమాలో టొవినో థామస్ మణియన్, అజయ్, కుంజికేలు అనే మూడు పాత్రల్లో నటిస్తున్నాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని జితిన్ లాల్ డైరెక్ట్ చేస్తున్నారు.

సినిమాలో కృతి శెట్టితో పాటుగా ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తున్నాడు.తెలుగు తమిళ భాషల్లోనే కాదు మళయాళంలో కూడా తన హవా కొనసాగించాలని చూస్తుంది కృతి శెట్టి.

తెలుగులో అరడజనుకు పైగా సినిమాలు చేసిన కృతి శెట్టి ఉప్పెన తర్వాత మరో రెండు సినిమాలు హిట్ సాధించింది.

అయితే తెలుగులో ఫ్లాపులు పడుతున్నా వేరే భాషల్లో మాత్రం వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటుంది కృతి శెట్టి.

తప్పకుండా కృతి శెట్టికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు.