నిద్రించే ముందు ఈ టిప్స్ పాటిస్తే..యవ్వనంగా మెరిసిపోతారట!
TeluguStop.com
అందంగా, యవ్వనంగా మెరిసి పోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.కానీ, అందుకు ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి? ఏమేం జాగ్రత్తలు పాటించాలి? అన్న వాటిపై చాలా మందికి అవగాహన ఉండదు.
ఈ క్రమంలోనే చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తారు.రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్స్ వెళ్తారు.అయితే ఇవేమి కాకుండా ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే గనుక మీ చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.
మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ఎటువంటి చర్మ సమస్యలనైనా నివారించడంలో మునగాకు ది బెస్ట్ అని చెప్పొచ్చు.
ఒక కప్పు మునగాకు తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి.ఇప్పుడు ఈ మునగాకు రసాన్ని దూది సాయంతో ముఖానికి, మెడకు పట్టించాలి.
ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు, మొటిమలు, ముడతలు పోయి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.
"""/" /
అలాగే కొందరికి కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి.అందాన్ని చెడగొట్టడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి.
అందుకే రెండు స్పూన్ల పాలలో, అర స్పూన్ తేనె కలిపి కళ్ల చుట్టు అప్లై చేసుకోవాలి.
ఆ తర్వాత కాసేపు వేళ్లతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి.ఇలా నిద్రించే ముందు చేసి.
ఉదయాన్నే చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే డార్క్ సర్కిల్స్ దూరమై చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.
"""/" /
కొందరి పెదవులు డ్రైగా, నిర్జీవంగా కనిపిస్తుంటాయి.దాంతో అందం కూడా దెబ్బ తింటుంది.
అందుకే పడుకునే ముందు పెదవులకు అలోవెర జెల్ అప్లై చేసి టూత్ బ్రెష్‌తో స్క్రబ్ చేయండి.
ఆ తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకుని న్యాచురల్ లిప్ బాంబ్ అప్లై చేసుకుని పడుకోండి.
తద్వారా పెదవులు అందంగా, మృదువుగా మారతాయి.ఇక ఈ టిప్స్‌తో పాటు కంటి నిండి నిద్రపోండి.
వాటర్ ఎక్కువగా తీసుకోండి, డైట్‌లో పోషకాహారం ఉండేలా చూసుకోండి.రెగ్యులర్‌గా వ్యాయామాలు, యోగాలు చేయండి.
మరియు కెమికల్స్ ఎక్కువగా ఉండే స్కిన్ ప్రోడెక్ట్స్ కు దూరంగా ఉండండి.