అందం విషయంలో ఆడవారు అస్సల రాజీ పడరు.ఈ విషయం అందరికీ తెలుసు.
ముఖ్యంగా చర్మం అందంగా, మృదువుగా, ఆకర్షణీయంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు.కానీ, అదేం విచిత్రమో.
అనుకున్న దానికి భిన్నంగా చర్మం ఉంటుంది.మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మం పొడిబారిపోవడం ఇలా రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి.
ఇక ఈ చర్మ సమస్యలకు చెక్ పెట్టేందుకు వేలకు వేలు ఖర్చు చేసి ఏవేవో ప్రోడెక్ట్స్ వాడేస్తుంటారు.
కానీ, ఇంట్లోనే ఈ సమస్యలను సులువుగా నివారించవచ్చు.గోధుమపిండి చర్మ సమస్యలకు చెక్ పెట్టడంలో.
ముదువైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.మరి గోధుమ పిండిని చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో గోధుమపిండి, రోజ్ వాటర్ మరియు పాల మీగడ వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి.బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా మారడంతో పాటు మంచి రంగు వస్తుంది.