పుచ్చ‌తో ఇలా చేస్తే..మృదువైన‌, మెరిసే చ‌ర్మం మీసొంతం!

పుచ్చ‌కాయ‌ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వేస‌వి కాలంలో విరి విరిగా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

వేస‌వి తాపాన్ని తీర్చే పుచ్చ‌కాయ‌ రుచిలోనే కాదుబోలెడ‌న్ని ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ ముందుంటుంది.

అయితే పుచ్చ‌కాయ‌లో ఉండే పోష‌కాలు కేవ‌లం ఆరోగ్యానికే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా మెరుగుప‌డ‌తాయి.

ముఖ్యంగా చ‌ర్మాన్ని మృదువుగా మార్చ‌డంలోనూ, కాంతివంతమైన చ‌ర్మాన్ని అందించ‌డంలోనూ పుచ్చ‌కాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి పుచ్చ‌కాయ‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పుచ్చ‌కాయ గుజ్జు మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా, కోమ‌లంగా మారుతుంది.

"""/"/ అలాగే పుచ్చ‌కాయ గుజ్జులో కొద్దిగా దోస‌కాయ గుజ్జు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌త‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది.

"""/"/ ఇక ఒక బౌల్ తీసుకుని అందులో పుచ్చ‌కాయ గుజ్జు మ‌రియు నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి పావు గంట పాటు వ‌దిలేయాలి.అనంతరం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు పోయి.

ముఖం కాంతివంతంగా మారుతుంది.

Former Minister KTR : రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు..: కేటీఆర్