చర్మకాంతిని పెంచే వాల్నట్స్.. ఎలా ఉపయోగించాలంటే?
TeluguStop.com
వాల్నట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తామో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.రాళ్లలా కనిపించే ఈ వాల్నట్స్‌లో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి.
మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, మాంగనీస్, సెలీనియం, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఈ, విటమిన్ బి ఇలా వాల్నట్స్‌లో ఉండే అనేక పోషకాలు మన ఆరోగ్యానికి గ్రేట్‌గా సహాయపడతాయి.
అందుకే రెగ్యులర్ వాల్నట్స్‌ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.అయితే వాల్నట్స్ ఆరోగ్యానికి మాత్రమే అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే, సౌందర్య పరంగానూ వాల్నట్స్ ఉపయోగపడతాయి.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా పొడి చర్మంతో బాధ పడుతున్న వారు ముందుగా కొన్ని వాల్నట్స్‌ను పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో కొద్దిగా వాల్నట్స్ పొడి, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా మారుతుంది.అలాగే ఒక బౌల్‌లో వాల్నట్స్ పొడి, రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టింది.పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారినికి మూడు సార్లు చేస్తే.
ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. """/"/
ఇక వాట్నట్స్ పొడిని ఒక బౌల్‌లో తీసుకుని.
అందులో కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రామన్ని ముఖానికి పట్టింది.
అరగంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై మృతకణాలు పోయి.చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.
జగన్ ఈ విషయంలో తప్పుచేశారా ?