స‌పోటాతో ఇలా చేస్తే.. మీ చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరిసిపోవ‌డం ఖాయం!

స‌పోటాతో ఇలా చేస్తే మీ చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరిసిపోవ‌డం ఖాయం!

స‌పోటా పండ్లు ఎంత రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్ట‌ప‌డి తింటుంటారు.

స‌పోటాతో ఇలా చేస్తే మీ చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరిసిపోవ‌డం ఖాయం!

ఆరోగ్య ప‌రంగా కూడా స‌పోటా పండ్లు చేసే మేలు అమోగం.స‌పోటా పండ్ల‌లో విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, ఐర‌న్‌, కాపర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

స‌పోటాతో ఇలా చేస్తే మీ చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరిసిపోవ‌డం ఖాయం!

అటువంటి స‌పోటా పండ్లు కేవ‌లం ఆరోగ్యానికే కాదుచ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా మెరుగ్గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

"""/"/ ముఖ్యంగా చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మార్చ‌డంలో ముడ‌త‌ల‌ను, మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో స‌పోటా పండ్లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి వీటిని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స‌పోటా పండు నుంచి గుజ్జు తీసుకుని బౌల్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు స‌పోటా గుజ్జులో కొద్దిగా తేనె వేసి బాగా క‌లిపి ముఖానికి అప్లై చేయాలి.

ఇర‌వై నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ త‌ర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి య‌వ్వ‌నంగా మారుతుంది.

"""/"/ అలాగే బాగా పండిన స‌పోటా పండు గుజ్జులో బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మానికి ముఖానికి, మెడ‌కు అప్లై చేసి అర గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే ముఖంపై మృత‌క‌ణాలు పోతాయి.

మ‌రియు చ‌ర్మం కూడా తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. """/"/ ఇక స‌పోటా పండు నుంచి గుజ్జు తీసుకుని అందులో పెరుగు మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ఆర‌బెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు తగ్గుముఖం ప‌డ‌తాయి.

మ‌రియు చ‌ర్మం ఫ్రెష్‌గా మారుతుంది.

సింగర్ ప్రవస్తిది ఏ కులం… గూగుల్ సెర్చ్ చేస్తున్న నెటిజన్స్….ఈ కుల పిచ్చి ఏంట్రా బాబు!

సింగర్ ప్రవస్తిది ఏ కులం… గూగుల్ సెర్చ్ చేస్తున్న నెటిజన్స్….ఈ కుల పిచ్చి ఏంట్రా బాబు!