ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా మార్చే గ‌స‌గ‌సాలు..ఎలాగంటే?

వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని అందించే గ‌స‌గ‌సాల్లో బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే గ‌స‌గ‌సాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో జ‌బ్బుల‌ను సైతం నివారిస్తాయి.

ఇక గ‌స‌గ‌సాలు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డంలోనూ స‌హాయ‌ప‌డ‌తాయి.ముఖ్యంగా ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా మార్చ‌డంలో, మొటిమ‌ల‌ను మ‌టుమాయం చేయ‌డంలో ఇవి గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌రి ఇంత‌కీ చ‌ర్మానికి గ‌స‌గ‌సాల‌ను ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ ముందుగా గ‌స‌గ‌సాల‌ను డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో కొద్దిగా బాదం పొడి మ‌రియు ప‌చ్చి పాలు వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం త‌డి చేతుల‌తో స్క్ర‌బ్ చేసుకుంటూ.చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే మృత‌క‌ణాలు, మురికి పోయి.చ‌ర్మం తాజాగా, కాంతివంతంగా క‌నిపిస్తుంది.

అలాగే గసగసాలను కొబ్బరి పాలలో గంట‌, రెండు గంట‌ల పాటు నానబెట్టి.ఆ త‌ర్వాత పేస్ట్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చిని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం య‌వ్వ‌నంగా మ‌రియు గ్లోగా మారుతుంది.

ఈ ప్యాక్‌తో మొటిమ‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. """/"/ ఇక గ‌స‌గ‌సాల పొడిలో పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ప‌ది, ఇర‌వై నిమిషాల పాడు అర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్ తో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేస్తే.

ముడ‌త‌లు మ‌టుమాయం అవుతాయి.ముఖం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.

జేమ్స్ కామెరూన్ స్థాయికి రాజమౌళి వెళ్లగలుగుతాడా..?