బంతిపూలతో ఇలా చేస్తే..వర్షాకాలంలోనూ ముఖం మెరిసిపోతుంది!

ప్రస్తుతం వ‌ర్షాకాలం.ఈ కాలంలో ఆరోగ్యాన్నే కాదు.

చ‌ర్మాన్ని సుర‌క్షితంగా కాపాడుకోవ‌డం కూడా ఒక స‌వాలే.ఎందుకంటే, చ‌ర్మం త‌ర‌చూ పొడిబార‌డం, మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు ఇలా అనేక స‌మ‌స్య‌లు ఈ సీజ‌న్‌లోనే ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.

ఇక వీటిని నివారించుకుని.ముఖాన్ని కాంతివంతంగా మెరిపించుకునేందుకు ప‌డే తిప్పులు అన్నీ ఇన్నీ కావు.

అయితే స్కిన్ ప్రాబ్ల‌మ్స్‌కు చెక్ పెట్టిఫేస్‌ను గ్లోగా మెరిపించేలా చేయ‌డంలో బంతిపూలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలంకరణకు విరి విరిగా వాడే బంతి పూలు చ‌ర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

బంతిపూల‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ సుగుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతో సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి బంతి పూల‌ను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొన్ని బంతిపూల రేక‌ల‌ను తీసుకుని వాట‌ర్‌తో వేసి క‌ల‌ర్ చేంజ్ అయ్యేంత వ‌ర‌కు మ‌రిగించాలి.

"""/" / ఆ త‌ర్వాత నీటిని వ‌డ బోసి అందులో కొద్దిగా తేనె క‌లిపి దూది సాయంతో ముఖానికి పూసుకోవాలి.

ప‌ది, ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే డ్రై స్కిన్ మృదువుగా, కోమ‌లంగా మారుతుంది.మ‌రియు చ‌ర్మ ఛాయ కూడా పెరుగుతుంది.

అలాగే బంతి పూల రేకుల‌ను తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రాన్ని ముఖానికి అప్లై చేసుకుని పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డంలో మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

బన్నీ టూ రొమాంటిక్.. ఎవరూ లేకపోతే భార్యను అలా పిలుస్తారా?