చ‌ర్మ ఛాయ‌ను పెంచే అత్తిపండ్లు.. ఎలాగంటే?

అత్తి పండు లేదా అంజీర పండు.పేరు ఏదైనా రుచి, పోష‌కాలు ఒకటే.

అత్తి పండ్లను రోజుకు రెండు తీసుకున్నా.ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి.

అత్తి పండ్ల‌లో మెగ్నీషియం, మాంగనీసు, జింక్, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్ వంట్ ఖ‌నిజాల‌తో పాటు విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

ఇవి ఆరోగ్య ప‌రంగానే కాకుండా.సౌంద‌ర్య ప‌రంగా కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా చ‌ర్మ కాంతిని పెంచ‌డంలో, మెటిమ‌ల‌ను మ‌రియు మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో, చ‌ర్మాన్ని మృదువుగా మార్చ‌డంలో అత్తి పండ్లు గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌రి వీటిని ఎలా చ‌ర్మానికి ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.అత్తి పండు తీసుకుని మొత్త‌గా పేస్ట్‌లా చేసుకోవాలి.

ఆ పేస్ట్‌ను ఒక బౌల్‌లో తీసుకుని.అందులో కొద్దిగా పాలు మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి.

య‌వ్వ‌నంగా మారుతుంది. """/"/ ఇక మొటిమ‌లు‌, మొండి మ‌చ్చ‌ల‌తో ఇబ్బంది ప‌డేవారు.

అంజీర పండును పేస్ట్‌లా చేసుకుని.అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేస్తే.

మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.అలాగే అత్తి పండును గ్రైండ్ చేసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.

ఈ పేస్ట్‌లో కొద్దిగా ముల్తానీ మ‌ట్టి క‌లిపి ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

బాగా ఆరిపోనివ్వాలి.ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని, మెడ‌ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మ‌లినాలు, మృత‌క‌ణాలు పోయి.

కాంతివంతంగా, అందంగా మారుతుంది.

హీరో అజిత్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన భార్య షాలిని.. అసలేం జరిగిందంటే?