చ‌ర్మ ఛాయ‌ను పెంచే సోంపు.. ఎలాగంటే?

సోంపు.భోజ‌నం చేయ‌గానే ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అయ్యేందుకు దీనిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.

ప‌లు ర‌కాల వంట‌ల్లో కూడా సోంపును వాడుతుంటారు.ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణం చేయ‌డమే కాదు.

ఆరోగ్య‌ ప‌రంగా మ‌రియు సౌందర్య ప‌రంగా కూడా సోంపు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.జ్ఞాపక శక్తిని పెంచ‌డంలోనూ, అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ, గుండె జ‌బ్బులు దూరం చేయ‌డంలోనూ, నోటి దుర్వాస‌న‌కు చెక్ పెట్ట‌డంలోనూ, మలబద్దకం స‌మ‌స్య‌ను నివారించ‌డంలోనూ ఇలా అనేక ర‌కాలుగా సోంపు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇక సౌంద‌ర్య ప‌రంగా చూసుకుంటే.చ‌ర్మ ఛాయ‌ను పెంచ‌డంలో, మొటిమ‌ల‌ను మ‌రియు మ‌చ్చ‌ల‌ను నివారించ‌డంలో సోంపు స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి సోంపును చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా సోంపును మెత్త‌గా పౌడ‌ర్‌లా చేసుకోవాలి.

ఆ పౌడ‌ర్‌లో కొద్దిగా పెరుగు మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని.

ముఖానికి అప్లై చేసుకోవాలి.అర‌గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.

చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు కాంతివంతంగా మారుతుంది. """/" / రెండొవ‌ది.

అర గ్లాస్‌ నీటిలో సోంపు వేసి మ‌రిగించాలి.అనంత‌రం ఆ నీటిని చ‌ల్ల‌బ‌రిచి.

అందులో రెండు చుక్కల టీట్రీ ఎస్సెన్సియల్ ఆయిల్ వేసి స్టోర్ చేసుకోవాలి.రాత్రి నిద్రించే ముందు ఈ నీటిలో దూదుని ముంచి ముఖానికి అద్దుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మురికి, జిడ్డు, మృత‌క‌ణాలు పోయి.

అందంగా మారుతుంది.మూడొవ‌ది.

సోంపును పొడిగా చేసుకుని.అందులో కొద్ది నిమ్మ‌ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు పోయి ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

ఆ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధ పడుతున్నా.. నటుడిపై సందీప్ కామెంట్స్ వైరల్!