మొటిమలను పోగొట్టి ముఖాన్ని అందంగా మార్చే సొరకాయ..ఎలాగంటే?
TeluguStop.com
ముఖం మెరుస్తూ అందగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.ఈ నేపథ్యంలోనే చర్మానికి కాస్ట్లీ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వాడుతుంటారు.
అయితే ఎంత ఖరీదైన ఉత్పత్తులు ఉపయోగించినా ఏదో ఒక చర్మ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
అందులో మొదటిది ఇరిటేట్ చేసే సమస్య మొటిమలే.ఇక ఈ మొటిమలను తగ్గించుకుని.
ముకాన్ని అందంగా మార్చుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.కానీ, ఎలాంటి హైరానా పడకుండా సొరకాయతో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే.
మొటిమలు పరార్ అవ్వడంమే కాదు ముఖం కూగా కాంతివంతంగా మెరిసిపోతుంది.ముందుగా సొరకాయను తొక్కతో పాటే ముక్కలుగా కట్ చేసి.
మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సొరకాయ పేస్ట్ మరియు కొద్దిగా పెరుగు మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకుని.
టవల్‌తో తుడుచుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే మొటిమలు తగ్గి.
చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది. """/" /
అలాగే సొరకాయ ముక్కలను మెత్తగా నూరి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఆ రసంలో కొద్దిగా శనగపిండి మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి.బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేసినా మొటిమలు తగ్గి.ముఖం అందంగా మెరుస్తుంది.
ఈ టిప్స్‌తో పాటు రోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగితే మొటిమలు, నల్ల మచ్చలు, ముడతలు తగ్గు ముఖం పట్టి.
ముఖంలో సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.చర్మం యవ్వనంగా కూడా మారుతుంది.
ఇక సొరకాయ జ్యూస్ తాగితే.జుట్టు కూడా ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
మరియు తెల్ల జుట్టు సమస్య దరి చేరకుండా ఉంటుంది.
వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి