వంట సోడాతో ఇలా చేస్తే.. ముఖం అందంగా మెరిసిపోవాల్సిందే!
TeluguStop.com
వంట సోడా.దీనినే బేకింగ్ సోడా, సోడియం బై కార్బోనేట్ అని కూడా అంటుంటారు.
వంటల్లో విరి విరిగా ఉపయోగించే వంట సోడా.కేవలం వంటలకే కాదు.
దీనితో ఇతరత్రా ఉపయోగాలూ కూడా పుష్కలంగా ఉన్నాయి.ముఖ్యంగా వంట సోడా సౌందర్య పరంగా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో, డార్క్ స్పాట్స్‌ను దూరం చేయడంలో, మొండి మొటిమలను తగ్గించడంలో, స్కిన్ టోన్‌ను మెరుగు పరచడంలో ఇలా రకరకాలుగా వంట సోడా ఉపయోగపడుతుంది.
మరి వంట సోడాను చర్మానికి ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో టీ స్పూన్ బ్రేకింగ్ సోడా మరియు ఇంట్లో తయారు చేసుకున్న రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేయడం వల్ల డార్క్ స్పాట్స్, మొటిమలు తగ్గడంతో పాటుగా.
ముఖం కాంతివంతంగా మారుతుంది. """/"/
రెండొవది.
ఒక బౌల్‌లో అర స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ ఓట్ మీల్, తేనె మరియు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అర గంట పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ముఖంపై మృతకణాలు, మురికి పోయి అందంగా మెరుస్తుంది.
ముఖంపై ముడతలు పోయి మృదువుగా మారాలి అని కోరుకునే వారు.ఒక బౌల్ తీసుకుని అందులో వంట సోడా మరియు కొబ్బరి నూనె వేసి మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమానికి ముఖానికి ఫ్యాక్‌లా వేసుకుని.ఇరవై లేదా ముప్పై నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖంపై ముడతలు పోయి మృదువుగా మరియు యవ్వనంగా మారుతుంది.
దేవకట్టా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడా..?