ఆస్పిరిన్ టాబ్లెట్స్‌తో ఇలా చేస్తే..మీ ఫేస్ బ్రైట్‌గా మెరిసిపోతుందట!
TeluguStop.com
ఆస్పిరిన్ టాబ్లెట్.ఇదో పెయిన్ కిల్లర్ అని అందరికీ తెలుసు.
తల నొప్పిని క్షణాల్లో తగ్గించడంలో ఈ టాబ్లెట్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంటారు.అందుకే చాలా మంది తల నొప్పి వచ్చిందంటే చాలు.
టక్కున ఆస్పిరిస్ టాబ్లెట్‌ను వేసేసుకుంటారు.కానీ, ఈ టాబ్లెట్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.
చర్మానికి సౌందర్యానికి కూడా ఇది ఉపయోగపడుతుందని.అవును, ముఖాన్ని బ్రైట్‌గా, వైట్‌గా మార్చడంలోనూ, డ్రై స్కిన్‌ను నివారించడంలోనూ ఆస్పిరిన్ టాబ్లెట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఇంతకీ ఈ టాబ్లెట్స్‌ను స్కిన్‌కు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు ఐదు లేదా ఆరు ఆస్పిరన్ టాబ్లెట్స్‌ను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆస్పిరన్ టాబ్లెట్స్ పొడి, ఒక స్పూన్ పెరుగు, అర స్పూన్ బాదం ఆయిల్, అర స్పూన్ నిమ్మ రసం తీసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి.పది లేదా పదిహేను నిమిషాల పాటు డ్రై అవ్వనవ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి, మృతకణాలు పోయి.
ఫేస్ గ్లోగా, బ్రైట్‌గా మెరుస్తుంది. """/" /
అలాగే పది ఆస్పిరిన్ టాబ్లెట్స్‌ను తీసుకుని మెత్తగా నూరుకోవాలి.
ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల తేనెను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.
పది నిమిషాల తర్వాత మెల్ల మెల్లగా రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే పొడి చర్మం మృదువుగా మరియు తేమగా మారుతుంది.
ఇక మొటిమలను నివారించడంలోనూ ఈ టాబ్లెట్స్ ఉపయోగపడతాయి.ముందుగా ఒక బౌల్‌లో మూడు లేదా నాలుగు ఆస్పిరన్ టాబ్లెట్ల పొడి, రెండు స్పూన్ల హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోటు అప్లై చేసి.ఇరవై నిమిషాల తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పరార్ అవుతాయి.
రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..? ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు..?