యాపిల్ పీల్‌తో ఇలా చేస్తే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం?

యాపిల్‌.దీని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

నేటి కాలంలో అంద‌రికీ యాపిల్స్ అందుబాటులో ఉంటున్నాయి.ఎన్నో పోష‌కాలు దాగి ఉన్న యాపిల్ రోజుకొక‌టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిద‌ని ఆరోగ్య నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉంటారు.

అవును, యాపిల్‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ మ‌రియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి.అవి మ‌న ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.

అయితే సాధార‌ణంగా చాలా మంది ప‌లు కార‌ణాల వ‌ల్ల యాపిల్‌పై తొక్క‌ను తీసి పారేస్తుంటారు.

కానీ, నిజానికి యాపిల్‌ను తొక్క‌తో తింటేనే ఆరోగ్యానికి అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి.ఒక‌వేళ అలా తిన‌డం త‌మ‌కు ఇష్టం లేదు అని భావించే వారు.

యాపిల్ పీల్‌ను పాడేయ‌కుండా చ‌క్క‌గా చ‌ర్మ సౌంద‌ర్యానికి యూజ్ చేసుకోవ‌చ్చు.గ్లోయింగ్ స్కిన్ అందించ‌డంలో, మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గించ‌డంలో యాపిల్ పీల్ గ్రేట్‌గా స‌మాయ‌ప‌డుతుంది.

మ‌రి ఇంత‌కీ యాపిల్ పీల్‌ను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా యాపిల్ పీల్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మ‌రియు రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి.

ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేయాలి.అర గంట పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే.

మొటిమ‌లు పోయి ముఖం గ్లోయింగ్‌గా మ‌రియు మృదువుగా మారుతుంది.అలాగే యాపిల్ పీల్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని.

అందులో కొద్దిగా పాలు మ‌రియు చంద‌నం పొడి వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు సార్లు చేస్తే.ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు పోయి య‌వ్వ‌నంగా మారుతుంది.

రోడ్డుపై పిల్లలతో వెళ్తున్నారా.. అయితే సజ్జనార్ షేర్ చేసిన ఈ వీడియో చూడాల్సిందే..