బాదంతో మెరిసే, మృదువైన చ‌ర్మం మీ సొంతం.. ఎలాగంటే?

ఉద‌యాన్నే నాన బెట్టిన బాదం ప‌ప్పు తిన‌డం చాలా మందికి ఉన్న అల‌వాటు.

ఇలా తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌ర‌గ‌డంతో పాటు బ‌రువు కూడా త‌గ్గుతారు.

మ‌రియు ఎన్నో జ‌బ్బుల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు.అయితే బాదం ప‌ప్పు ఆరోగ్యానికే కాదు.

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా మృదువైన చ‌ర్మాన్ని అందించ‌డంలోనూ, చ‌ర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయ‌డంలోనూ అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌రి బాదం ప‌ప్పు చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొన్ని బాదం ప‌ప్పుల‌ను నాన బెట్టుకుని తొక్క తీసుకోవాలి.అనంత‌రం వాటిని బాగా పేస్ట్ చేసుకుని.

అందులో కొద్దిగా రోజ్ వాట‌ర్‌ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.ఇక పావు గంట లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.

బాదంలో ఉండే విట‌మిన్ ఏ, ఈలు చ‌ర్మంపై మృత‌క‌ణాల‌ను తొలిగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

రెండొవ‌ది.ఒక బౌల్‌లో బాదం ప‌ప్పు పౌడ‌ర్ తీసుకుని అందులో కొద్దిగా పాలు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ఒక అర‌గంట పాటు ఆరిపోనివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల పొడి చ‌ర్మం దూర‌మై.

ముఖం మృదువుగా మారుతుంది.మూడొవ‌ది.

ఒక బౌల్‌లో బాదం ప‌ప్పు పౌడ‌ర్‌, శెన‌గ‌పిండి మ‌రియు పెరుగు మూడిటిని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.అర‌గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని, మెడ‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉన్న న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు క్ర‌మంగా త‌గ్గుతాయి.

ఢిల్లీలో 12 పాఠశాలలకు బాంబు బెదిరింపులు..!