వాముతో ఇలా చేస్తే.. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు పోవాల్సిందే!
TeluguStop.com
వాము.ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
బరువు తగ్గేందుకు, తిన్నది త్వరగా అరిగించుకునేందుకు వామును తరచూ ఉపయోగిస్తూనే ఉంటారు.అలాగే పిండి వంటల్లో కూడా వామును రుచి కోసం ఉపయోగిస్తుంటారు.
ఇక ఎన్నో ఔషధ గుణాలు నిండిన వాము.గుండె జబ్బులను, జీర్ణ సమస్యలను, కీళ్ళ నొప్పులను, జలుబు మరియు దగ్గు సమస్యలను, తలనొప్పిని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలనే నయం చేస్తుంది.
అయితే వాము కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా.సౌందర్య పరంగానూ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ముఖంపై ఉన్న మొటిమలను, నల్ల మచ్చలను తగ్గించి.అందాన్ని రెట్టింపు చేయడంలో వాము సహాయపడుతుంది.
మరి ఇంతకీ వామును చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా వామును తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మొత్తగా పౌడర్‌లా చేసుకోవాలి.
ఆ పౌడర్‌లో కొద్దిగా శెనగపిండి మరియు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాలు పాటు ఆరిపోనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల నల్ల మచ్చలు క్రమంగా తగ్గి.
చర్మం కాంతివంతంగా మారుతుంది. """/"/
రెండొవది.
ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాము పౌడర్ మరియు పెరిగు వేసి మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అరగంట పాటు వదిలేయాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
మూడొవది.నీటిలో వామును వేసి బాగా మరిగించేయాలి.
అలా మరిగించిన నీటిని చల్లారనిచ్చి.అందులో కొద్దిగా తేనె వేసి కలపాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమానికి ముఖానికి అప్లై చేసి.బాగా ఆరిపోనివ్వాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ముడతలు, సన్నని గీతలు పోయి.
యవ్వనంగా కనిపిస్తుంది.
సంక్రాంతి సినిమాలతో దిల్ రాజుకు పూర్వ వైభవం దక్కుతుందా.. ఆ రేంజ్ హిట్లు సాధిస్తాడా?