అందాన్ని రెట్టింపు చేసే ఎగ్ ప్యాక్స్.. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
TeluguStop.com
ఎగ్ (గుడ్డు) ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు గుడ్డులో లభ్యమవుతాయి.
అందుకే ఆరోగ్య నిపుణులు కూడా రోజుకో గుడ్డు తీసుకోమని చెబుతుంటారు.అయితే గుడ్డు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.
చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ అద్భుతంగా సహాయపడుతుంది.అయితే చాలా మందికి గుడ్డును చర్మానికి ఎలా ఉపయోగించాలో తెలియకపోవచ్చు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయ్యి.ముఖాన్ని మరింత అందంగా మార్చుకోండి.
ముందుగా ఒక బౌల్‌లో కేవలం ఎగ్ వైట్ మాత్రమే తీసుకుని.అందులో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు వేసి మిక్స్ చేయాలి.
బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.ఒక పావ గంట పాటు ఆరనిచ్చి.
అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయి.
అలాగే ముఖం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.రెండొవది ఏంటంటే.
ఒక బౌల్‌లో ఎగ్ వైట్‌ను మాత్రమే తీసుకుని.అందులో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పడు ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుని.పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల.ముఖం మృదువు, మారుతుంది.
అదే సమయంలో ముడతలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి.ఇక మూడొవ ప్యాక్ ఏంటీ అంటే.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ తీసుకోవాలి.అందులో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి.
ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.ఈ ప్యాక్ వేసుకున్న పది నిమిషాలు లేదా పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మృతకణాలు పోయి చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.
కాబట్టి, ఈ ఎగ్ ప్యాక్స్‌ను మీరు కూడా తప్పకుండా చేయండి.
రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?