పిల్ల చూడడానికి సూపర్.. కానీ చేసే పనులు మాత్రం బేకార్…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు తమ అంద చందాలతో మాయ మాటలు చెబుతూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఓ యువతి తాను ఓ ఆర్థిక సంబంధిత శాఖ నుంచి వచ్చానని చెబుతూ ఉద్యోగ విరమణ పొందిన వైద్యుడి నుంచి దాదాపుగా 5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన ఒడిషా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన తాల్చేర్ పరిసర ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి ఓ వైద్యుడు నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడు గత కొద్ది కాలంగా పలు వ్యక్తిగత కారణాల వల్ల తన కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంటున్నాడు.
అయితే తాజాగా ఓ యువతి తాను ఆర్థిక లావాదేవీల సంబంధిత శాఖ నుంచి వస్తున్నానని కాబట్టి తమ బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేస్తే ప్రభుత్వం విధించే పలు టాక్స్ ల నుంచి మీ డబ్బులను కాపాడుతానని అంటూ కట్టు కథలు అల్లింది.
దీంతో ఈ విషయాన్ని నమ్మినటువంటి ఆ వైద్యుడు తన బ్యాంకు ఖాతా వివరాలను ఆమెకు తెలియజేశాడు.
ఇంకేముంది ఈ పాటికి మీకు విషయం పూర్తిగా అర్థం అయి ఉంటుంది.పిల్ల వైద్య వృద్ధుడి ఖాతా నుంచి దాదాపుగా 5 లక్షల రూపాయల నగదు ని విత్ డ్రా చేసింది.
పాపం తిని తినకుండా కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్న సమయంలో ఉపయోగపడుతుందనుకుంటే అందమైన యువతి వచ్చి తేనె పూసిన మాటలతో దండుకు పోయింది.
దీంతో వైద్యుడు చేసేదేమీ లేక లబో దిబోమంటూ తన సొమ్ముని తనకు తిరిగి ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)