తాజ్ మహల్ వద్ద సందడి చేసిన అందాల ముద్దుగుమ్మలు.. వీడియో వైరల్..

ప్రపంచ వింతల్లో ఒకటి, ఈ భూ ప్రపంచంపై అత్యంత సుందరమైనది తాజ్ మహల్.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉండే ఈ సమాధి వద్దకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

కాగా తాజాగా తాజ్‌మహల్ వద్దకి అందాల భామలు విచ్చేశారు.మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న ఈ అందాల భామలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత తాజ్ మహల్‌ వద్ద కనుల విందు చేశారు.

ఇటీవలే తాజ్‌ కు చేరుకున్న ఈ అందాల తారలు 35 దేశాలకు చెందినవారు.

ఈ సుందరీమణులు అత్యంత సుందరమైన తాజ్ మహల్‌ దగ్గరే చాలా సేపు తిరుగుతూ ఎంజాయ్ చేశారు.

ఈ అందాల భామలు తమ ఫ్యాషన్‌ షోలు, ఆటపాటలతో విజిటర్లని మంత్రముగ్ధులను చేశారు.

ఈ విశ్వసుందరి మణులు తాజ్​మహల్ బ్యూటీని చూసి స్టన్ అయ్యారు.ఆ తర్వాత గైడ్స్‌ సహాయంతో ఈ చారిత్రాత్మక కట్టడం గురించి అనేక విశేషాలు తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయారు.

పాలరాతితో నిర్మించిన ఈ నిర్మాణం గురించి కూడా తెలుసుకున్నారు.తాజ్ మహల్ ముందు జరిగిన ఒక ఫొటో షూట్‌లో ఈ అందమైన మోడల్స్ పాల్గొన్నారు.

"""/"/ తాజ్ మహల్ దగ్గర నుంచి చూస్తే ఒక స్వర్గంలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది.

ఇంతకుముందు ఫేసుబుక్ ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్, యాక్టర్ టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ప్రిన్సెస్ డయానా, వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రముఖులందరూ తాజ్ మహల్ కళ్ళారా చూసి దాని అందాలకు ఫిదా అయ్యారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం తాజ్​మహల్​ పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది.ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో సెల్ఫీలు దిగేందుకు టూరిస్టులు బాగా ఇష్టపడుతున్నారు.

అమెరికాలో అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసిన బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!