పార్క్‌లో తల్లీకొడుకులకు షాకింగ్ అనుభవం.. సడన్‌గా దగ్గరకొచ్చిన ఎలుగుబంటి.. తర్వాతేమైందంటే..

అడవిలో ఉండే కౄర జంతువులు వాటి ఆవాసాలను కోల్పోతూ జనావాసాల్లోకి వస్తున్నాయి.సడన్‌గా ప్రత్యక్షమయ్యే ఈ జంతువుల దాడిలో కొందరు గాయాల పాలు కూడా అవుతున్నారు.

చిరుతపులుల నుంచి ఎలుగుబంట్ల( Bear ) వరకు అడవి జంతువులు మనుషులు నివసించే ప్రాంతంలోకి అడుగుపెడుతున్నాయి.

అవి ఎదురు పడినప్పుడు గుండె ఆగిపోయినంత పని అవుతుంది.తాజాగా కొడుకుతో కలిసి ఒక పార్కుకి( Park ) వెళ్లిన తల్లికి ఇలాంటి అనుభవమే ఎదురయింది.

సడన్‌గా ఒక ఎలుగుబంటి ఇచ్చి వారికి షాక్ ఇచ్చింది.వారు పార్కులో ఫుడ్ ఎంజాయ్ చేస్తుండగా అనుకోకుండా నల్లటి ఎలుగుబంటి పిల్ల వారిని పలకరించింది.

దాంతో కొడుకు భయపడిపోయాడు.తల్లి కుమారుడి కళ్ళను తన చేతులతో మూసింది.

ఆ సమయంలో ఎలుగుబంటి వారి ఫుడ్ అంతా తినేసింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / వివరాల్లోకి వెళ్తే.ఇటీవల న్యూవో లియోన్‌లోని శాన్ పెడ్రో గార్జా గార్సియాలోని చిపింకే ఎకోలాజికల్ పార్క్‌కు( Chipinque Ecological Park ) పిక్నిక్ కోసం తల్లి కొడుకులు వచ్చారు.

ఫుడ్ తింటుండగా ఒక ఎలుగుబంటి వారి వద్దకు వచ్చింది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇందులో ఓ మహిళ తనను తాను ప్రశాంతంగా ఉంచుకుని తన బిడ్డను ఎలా కాపాడుకుందో చూడవచ్చు.

ఎలుగుబంటి బాలుడి దగ్గరికి వెళ్లి పిక్నిక్ టేబుల్( Picnic Table ) మీద నిలబడి భోజనం చేసింది.

"""/" / దాదాపు 2 నిమిషాల పాటు మెక్సికన్ సంప్రదాయ ఆహారాన్ని ఆస్వాదించినా ఎలుగుబంటి కడుపు నిండలేదు.

ఇది చాలా డ్రింక్స్ తాగడంతో పాటు, ఫుడ్ అంతా లాగించింది.తరువాత ఎలుగుబంటి టేబుల్ మీద నుండి దిగి, మరింత ఆహారం కోసం వెతుకుతూ ఖాళీ ట్రే వైపు వెళ్ళింది.

వైరల్ అయిన టిక్‌టాక్ వీడియో రెండు రోజుల క్రితం షేర్ చేశారు.అప్పటి నుండి 6 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

ఈ ఘటనలో ఎవరిపైన అది దాడి చేయలేదు.తర్వాత ఆ ఎలుగుబంటిని పట్టుకుని అడవిలోకి వదిలారు.

కేసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు