వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా: వాతావరణంలో మార్పుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని,ఎండకు తోడు వడగాలులు,ప్రకృతిలో మార్పులు,వర్షం వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావు అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో వైద్య,ఆరోగ్య మరియు ఇతర అన్ని శాఖల జిల్లా అధికారులతో వడదెబ్బపై సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎండ నుంచి రక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఉష్ణోగ్రత పెరుగుతున్న దృశ్యా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని శాఖల మండల అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు.

వడదెబ్బ బారిన పడితే 108కు సమాచారం ఇస్తే సిబ్బంది తక్షణ అక్కడకు చేరుకుని చికిత్స అందిస్తారని,దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తారని తెలిపారు.

ప్రతి మండలంలో మెడికల్ ఆఫీసర్,సూపర్వైజర్ ఏఎన్ఎంలతో కూడిన టీం ఏర్పాటు చేశామని,వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

బయటకు వెళ్ళినప్పుడు ఖద్దరు దుస్తులు ధరించి,గొడుగు,చలవ కళ్లద్దాలు ధరిస్తే మంచిదని, ఎండ వేడిమికి శరీరంలో నీరు ఆవిరి అవుతుందని,దాహం వేసినా వేయకున్నా తరచుగా మంచినీళ్లు తీసుకోవడం మంచిదని,పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని, మద్యం కాఫీ,టీలకు దూరంగా ఉండాలని సూచించారు.

అన్ని శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐదు పడకలు వడదెబ్బ బారిన పడ్డ వాళ్ల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గ్రామీణ అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఉద్యోగులు వారి శాఖ పరిధిలో అంగన్వాడి కార్యకర్తలు,ఇతర గ్రామ స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక అవగాహన కల్పించాలని,ప్రజలను ఆ దిశగా అప్రమత్తం చేయాలని తెలిపారు.

అనంతరం కరపత్రాలు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం, జిల్లా టాస్క్ ఫోర్స్ బృంద సభ్యులు,ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ వెంకటరమణ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,డిడబ్ల్యూఓ వెంకటరమణ,ఏహెచ్ఓ ఏ.

కుమారస్వామి,డీపీఓ కె.సూరేష్ కూమార్,డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నిరంజన్, చంద్రశేఖర్ ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

బడ్జెట్ 6 లక్షలు.. కలెక్షన్లు 800 కోట్లు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?