పానీ పూరీ తినేముందు క‌చ్చితంగా ఈ విష‌యాలు తెలుసుకోండి!

భారతదేశం అంతటా అత్యంత ప్రాచుర్యం పొందిన రోడ్ సైడ్ ఫుడ్స్ లో పానీ పూరీ( Pani Puri ) ముందు వ‌రుస‌లో ఉంటుంది.

గోల్గప్పా, ఫూచ్కా, గప్చుప్.ఇలా వివిధ పేర్ల‌తో పానీ పూరీని పిలుస్తారు.

సాయంత్రం అయ్యిందంటే చాలు పానీ పూరీ స్టాల్స్ చుట్టూ యువ‌తీయువ‌కులు వాలిపోతుంటారు.ముఖ్యంగా అమ్మాయిలో చాలా మంది పానీ పూరీకి ఫ్యాన్స్ గా ఉన్నారు.

అయితే పానీ పూరీ తినేముందు క‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.తిన‌డానికి పానీ పూరీ చాలా రుచిక‌రంగా ఉండొచ్చు.

కానీ దాని నాణ్యతలో లోపాలు ఉండ‌టం లేదా రెగ్యుల‌ర్ గా తిన‌డం చేస్తే ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

నిత్యం పానీ పూరీ తిన‌డం వ‌ల్ల జీర్ణ ఆరోగ్యం( Digestive Health ) దెబ్బ తింటుంది గ్యాస్, అజీర్ణం, లేదా కడుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు.

ఎక్కువ ఉప్పు లేదా పులుపు రసాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి గ్యాస్ట్రిటిస్‌కు దారితీస్తాయి.

"""/" / రోడ్డుపై తయారు చేసే పానీ పూరీల్లో పరిశుభ్రత లేకపోతే ఫుడ్ పొయిజనింగ్( Food Poisoning ) అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

పానీ పూరీ త‌యారీలో నాణ్యమైన నీటిని ఉపయోగించకపోతే టైఫాయిడ్, డయేరియా వచ్చే ప్రమాదం ఉంటుంది.

కొన్ని చోట్ల పానీ పూరీ రుచి పెంచ‌డానికి సోడా లేదా రసాయనాలు ఉపయోగిస్తారు, ఇవి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరం.

"""/" / పూరీ లేదా నీటిలో ఉపయోగించే పదార్థాలకు కొందరికి అలెర్జిక్ ప్రతిచర్యలు రావచ్చు.

అలాగే రెగ్యుల‌ర్ గా పానీ పూరీ తిన‌డం వ‌ల్ల అదిక బ‌రువు( Weight Gain ) పెర‌గ‌డానికి దారి తీస్తుంది.

పైగా పుల్లటి రసాలు కొంతమంది లో డీహైడ్రేషన్ ను కూడా క‌లిగిస్తాయి.కాబ‌ట్టి హైజీనిక్ ప్రదేశాల్లోనే పానీ పూరీని తినాలి.

మసాలా నీటిలో ఉపయోగించే పదార్థాలు తాజాగా ఉన్నాయా అని చూసుకోవాలి.రోడ్ సైడ్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని తినడం ఇంకా ఉత్తమం.

మ‌రొక విష‌యం ఏంటంటే.పానీ పూరీని రెగ్యుల‌ర్ గా తిన‌కూడ‌దు మ‌రియు ఒకేసారి అధిక మొత్తంలో కూడా తీసుకోకూడ‌దు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!