ఎండలు షురూ అయినవి జాగ్రత్తగా ఉండండి…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు.అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది.
గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈసారి ఎండలు ముందే రానున్నాయని,గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ( Meteorological Department ) అధికారులు అంటున్నారు.
అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.
ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ.ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది.
చలి కాలం( Winter ) కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతుంది
గత సంవత్సరంతో పోల్చితే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది.
ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవిలో ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలు అవుతుంది.కానీ,ఈ సంవత్సరం నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి సమ్మర్(Summer ) సుర్రు మనడానికి రెడీ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.దీనంతటికీ కారణం వాతావరణంలో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ ( EL Nino Effect )అని అంటున్నారు.
దీనివల్ల భూ తాపం ఎప్పటికప్పుడు పెరుగుతుందని అంటున్నారు.అయితే ఈ వేసవిలో వడ గాల్పుల ప్రభావం చూపనుందని,సమ్మర్ మొత్తంలో హీట్ వేవ్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.
అయితే తగిన జాగ్రతలు తప్పనిసరని చెబుతున్నారు.
How Modern Technology Shapes The IGaming Experience