ఆన్ లైన్ మోసలపట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ జిల్లా:మోసపూరితమైన ఆన్ లైన్ యాప్ లలో అధిక వడ్డీ ఆశా చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులని మోసం చేస్తున్నా కేసులు ఈ మధ్య కాలంలో చాలా నమోదవుతున్నాయని నల్లగొండ జిల్లా చందనా దీప్తి( Chandana Deepti ) తెలిపారు.

గురువారంఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు( Cyber ​​criminals ) రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారు.

జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్( Online Apps ) లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని,సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు,మెసేజ్ లు క్లిక్ చేయకూడని,నకిలీ వెబ్ సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు లాగేస్తున్నారు,అంతే కాకుండా వైద్య సహాయం, పేరు పొందిన కంపెనీలలో ఉద్యోగాల పేరుతో సులభంగా నమ్మే మోసాలను ఎంచుకొని మోసాలు చేస్తున్నారు అని,లోన్ యాప్ అంటూ సులభంగా లోన్ లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ మీ యొక్క డేటా మొత్తం తమ అధీనంలోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు,కాబట్టి ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదని,ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని లేనియెడల హెల్ప్ లైన్ నంబర్ 1930 కానీ, 155260 కి కాల్ చేసి తెలియజేయాలని .

ఒకరికి ఇవ్వాల్సిన అవార్డు మరొకరికి ఇచ్చారు..ఫ్యాన్స్ ఫుల్ యాంగ్రీ