బీ అలర్ట్.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్నారా.. ఇవి తెలుసుకోకుంటే రిస్కే..!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించేవారు చాలా ఎక్కువే ఉన్నారు.అయితే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరాలు కూడా రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి.
కాబట్టి గూగుల్ క్రోమ్ వాడుతున్నప్పుడు పీసీ, స్మార్ట్ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి చాలా జాగ్రత్తగా గూగుల్ క్రోమ్ ఉపయోగించుకోవాలి.ఏదైనా నకిలీ వెబ్సైట్ ఓపెన్ చేసిన, తెలియకుండా హానికరమైన లింకును క్లిక్ చేసిన ఫోన్లోకి మాల్ వేర్ చొరబడి హ్యాక్ గురయ్యా అవకాశాలు ఉన్నాయి.
సెక్యూరిటీ కోసం ఇచ్చే అప్డేట్లనే మాల్వేర్ కోసం ఉపయోగిస్తున్నారు.సైబర్ నేరగాళ్లు గూగుల్ క్రోమ్ ( Google Chrome )ఉపయోగిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ పలు ఫేక్ లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు.
ఈ డమ్మీ ఫేక్ లింకులను(Fake Links , ) కేవలం క్లిక్ చేస్తే చాలు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
ఈ ఫైల్ ద్వారా మాల్వేర్ ఫోన్లోకి ప్రవేశించి డేటా మొత్తం హ్యాక్ చేయబడుతుంది.
తరువాత బ్యాంక్ ఖాతాల డేటా సేకరించి సైబర్ నేరాలకు ( Cyber Crimes )పాల్పడతారు.
"""/" /
బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో పాప మెసేజ్ వచ్చి బ్రౌజర్ డేంజర్ లో ఉంది డేట్ చేసుకోండి అని ఓ లింక్ ప్రత్యక్షం అవుతుంది.
ఆ లింక్ క్లిక్ చేస్తే పీసీ లో మాల్వేర్ ప్రవేశిస్తుంది.కాబట్టి ఇటువంటి లింకులపై ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు.
"""/" /
ఏదైనా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటే గూగుల్ క్రోమ్ బ్యాక్ ఎండ్లో ఆటోమేటిగ్గా అప్డేట్ చేసేస్తుంది.
కాబట్టి మ్యానువల్ గా అప్డేట్ చేసే అవసరం ఉండదు.మ్యానువల్ గా అప్డేట్ చేయాలంటే ఓల్డ్ వర్షన్ ఓఎస్, ఓల్డ్ ప్రాసెసర్ అయితేనే చేయాలి.
ఏదైనా వెబ్సైట్ నకిలీదా లేదా అనే విషయం తెలియాలంటే ఆ వెబ్ సైట్ లో యూఆర్ఎల్ లో పాడ్ లాక్ సింబల్ ఉందా? లేదా? అనేది గమనించాలి.
ఆ సింబల్ ఉంటే టీఎస్ఎల్ లేదా ఎస్ఎస్ఎల్ సర్టిఫైడ్ పొందినట్టే.ఇందులో అయితే డేటా భద్రంగా ఉంటుంది.
కాబట్టి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఏదైనా లింక్ పై క్లిక్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే డేటా మొత్తం హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.