ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేరు తెలియని వారు లేరు.ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టులో దోషిగా తేలి రూ.
1 జరిమానా కట్టి సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే ఆయనకు తాజాగా బీసీడీ(బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ) నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో భూషణ్‌పై చట్టపరంగా తీసుకోవాల్సిన తప్పనిసరి చర్యలు తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తన ఢిల్లీ విభాగాన్ని ఆదేశించడంతో బీసీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో వచ్చే నెలలో తమ ముందు హాజరు కావాలంటూ బీసీడీ ఆదేశించింది.
న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్విట్టర్ లో ఆయన చేసిన వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం సుమోటో గా స్వీకరించి విచారణ జరిపింది.
ఈ క్రమంలో ఆయన ను కోర్టు ధిక్కరణ కింద దోషిగా నిర్ధారించినందున.బీసీడీలో తన సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని బీసీడీ ఆయనను కోరింది.
అక్టోబర్ 23న స్వయంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు కావాలంటూ బార్ కౌన్సిల్ సూచించింది.
అంతేకాకుండా ఈ నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా స్పందన తెలియజేయాలని కూడా బీసీడీ కోరింది.